Latest News

Tuesday, 10 February 2015

Telugu

జగన్ ముద్దులు చూసి ఆడవాళ్లు భయపడ్తున్నారు: అయ్యన్న, జెండా పీకేస్తారు


విశాఖ/శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు ఆదివారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన దుమ్మెత్తి పోశారు. జగన్ ముద్దులు చూసి ఆడవాళ్లు భయపడుతున్నారని విమర్శించారు.
జగన్ భరోసా యాత్ర పైన అయ్యన్న స్పందించారు. పాదయాత్రతో కాదని దమ్ముంటే తమ పాలన పైన చర్చకు రావాలని డిమాండ్ చేశారు. పనికిమాలిన ప్రతిపక్ష నేత ఉన్న సభకు వెళ్లాలంటేనే తనకు సిగ్గేస్తోందని విమర్శించారు.
తండ్రి (వైయస్ రాజశేఖర రెడ్డి), కొడుకు (జగన్)లు రాష్ట్రాన్ని దోచుకున్నారని, అలాంటి వారే ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్ని సంవత్సరాలైనా ఎన్టీఆర్‌ను గుర్తుంచుకోవాలని అయ్యన్న కార్యకర్తలకు సూచించారు. పార్టీలో పదవులు శాశ్వతం కాదని, కార్యకర్తల కోసం ఏం చేసినా తప్పులేదన్నారు.
త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా పీకేస్తారని శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఉండేందుకే జగన్ దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమమే చంద్రబాబు ధ్యేయమన్నారు.
మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలబెట్టడమే తమ ప్రభుత్వం ధ్యేయమని చెప్పారు. ప్రతిపక్ష నేతగా జగన్ పనికి రారు అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఉండేందుకు దొంగ దీక్షలు చేస్తే ఎవరూ నమ్మరని వ్యాఖ్యానించారు.
మూడు ముక్కలాట: బాబుతో పవన్ కళ్యాణ్, జగన్‌కు బ్రేక్‌లు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం భూస్వాధీనం కోసం జారీ చేసిన జీవోపై పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. భూమి ఇవ్వడానికి నిరాకరిస్తున్న రెండు గ్రామాల రైతులకు మెరుగైన ప్యాకేజీ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే ఆయన చంద్రబాబును కలుస్తారని అంటున్నారు.
రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుంటే తాను వ్యతిరేకిస్తానని పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించిన విషయం ప్రభుత్వం జారీ చేసిన జీవోతో రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తొలుత భూసేకరణ విధానాన్ని వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రైతులకు ఉత్తమమైన ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతాల్లో పర్యటించినప్పుడు చంద్రబాబు ప్రభుత్వ భూసేకరణ విధానాన్ని వ్యతిరేకించారు. ఆ తర్వాత హైదరాబాదులో ఏర్పాటు చేసిన సభలో ఉత్తమ ప్యాకేజీ మాట ఎత్తారు.
తన మాట నిలబెట్టుకున్నట్లు అవుతుంది, రైతులకు న్యాయం చేసినట్లు అవుతుందనే ఉద్దేశంతో ఉత్తమ ప్యాకేజీని సాధించడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఆందోళనకు దిగితే అది ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఉపకరించే అవకాశాలున్నాయి. పవన్ కళ్యాణ్ ఆందోళనను ఆసరాగా చేసుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భారీ యెత్తున ఆందోళనకు ముందుకు రావచ్చు. అదే జరిగితే అది వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి లాభిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జనసేన పార్టీకి ఇంకా నిర్మాణం లేకపోవడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రత్యామ్నాయంగా అది తయారయ్యే అవకాశాలు లేవు. తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడానికి కూడా వీలు కాదు. ఈ స్థితిలో జగన్ బలపడకుండా ఉండాలంటే భూసేకరణ సమస్యను చంద్రబాబుతో ఉభయతారకంగా పరిష్కరించుకోవడం మంచిదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. రైతులను సంతృప్తి పరిచే ప్యాకేజీని సాధించడం ద్వారా ప్రజలకు నచ్చజెప్పవచ్చుననే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తన మాట కూడా నెగ్గించుకున్నట్లు ఉంటుంది. తనపై ప్రజల్లో ఉన్న సానుకూల వైఖరి ప్రజల్లో అలాగే ఉండిపోతుందని ఆయన భావిస్తూ ఉండవచ్చు.


'దోచేయ్‌' కథ కీ 'దూకుడు‌' కథ కీ దగ్గర పోలిక?



హైదరాబాద్ : నాగచైతన్య హీరో గా నటించిన చిత్రం 'దోచేయ్‌'. కృతి సనన్‌ హీరోయిన్. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. ఏప్రిల్‌ 24న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి ఓ వార్త అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అది రూమరా...నిజమా అనేది తెలియటం లేదు. అది మరేదో కాదు..ఈ చిత్రం కథ మహేష్ 'దూకుడు‌' కథ ని పోలి ఉంటుందనేది.
ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునేదాని ప్రకారం... 'దోచేయ్‌' కథ ఇలా సాగుతుంది. తన తండ్రి కు చెందిన పగ తీర్చుకోవటానికి విలన్ ని రోడ్డు మీద పడేయటానికి హీరో కంకణం కట్టుకుంటాడు. అందులో భాగంగా ..అతనికి చెందిన ఆస్దిని దొంగతనం చేసి నాశనం చేయాలనుకుంటాడు. అందుకోసం ఓ తెలివైన ప్లాన్ వేస్తాడు. అందుకు బ్రహ్మానందాన్ని బకరా చేస్తాడు. బ్రహ్మానందానికి ఓ షూటింగ్ అని చెప్పి అతని ఇంట్లో ప్రవేశిస్తాడు.
అక్కడ నుంచి బ్రహ్మీని వాడుకుని తన దొంగతనం తెలివిగా పూర్తి చేస్తాడు. అయితే ఇదే కథా కాదా అన్నది మాత్రం తెలియదు. కేవలం ఫిల్మ్ సర్కిల్స్ లోనూ,కృష్ణా నగర్ లోనూ వినపడుతున్న కథ మాత్రం ఇది. ఇదే కథ అయితే మాత్రం దూకుడుకి బాగా దగ్గర పోలిక ఉన్నట్లే కదా.. అయితే సినిమా రిలీజ్ అవకుండా ఎలా నిర్ణయానికి లేదా అంచనాకు వస్తామంటారా..అదీ కరెక్టే.
చిత్రం విషయానికి వస్తే...
నిర్మాత మాట్లాడుతూ ''మనం దోపిడీకి గురి కాకూడదంటే ఎదుటివాడిని దోచేయడమే మార్గం అని నమ్మిన ఓ యువకుడి కథ ఇది. నాగచైతన్య అభినయం అందరినీ అలరిస్తుంది. రోజుకొకటి చొప్పున విడుదల చేస్తున్న పాటలకీ, ప్రచార చిత్రాలకీ మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా అందరి అంచనాలను అందుకొనేలా ఉంటుంది'' అన్నారు.
అలాగే... నాగచైతన్య హీరోగా స్వామిరారా టీమ్ తో మా బ్యానర్ లో నిర్మిస్తున్న దోచెయ్ చిత్రాన్ని ఏప్రియల్ 24న సమ్మర్ స్పెషల్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాం. అలాగే ఏప్రియల్ రెండో వారంలో లహరి మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియోను గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్ కు, టీజర్స్ కు ఎక్స్ ట్రార్డనరీ రెస్పాన్స్ వస్తోంది. అభిమానుల ఎక్సపెక్టేషన్స్ రీచ్ అయ్యేలా, మా బ్యానర్ ప్రతిష్టను మరింత పెంచేలా సుధీర్ వర్మ అద్బుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగ చైతన్య కెరీర్ లోమరో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అన్నారు.
ఈ చిత్రంలో చైతన్య ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో కనిపిస్తాడట. మోసం చేసేవారిని ఘరానా మోసంతో దెబ్బకొట్టే యువకుడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్నాడు. అందుకే దీనికి ‘దోచెయ్‌' అనే టైటిల్‌ను పెట్టినట్లు సమాచారం.
''ప్రతి మోసం వెనుక ఇద్దరుంటారు. ఒకరు మోసం చేసేవాడు. మోసపోయేవాడు. నువ్వు రెండో వాడు కాకుండా ఉండాలంటే, మొదటివాడివి అయ్యితీరాల్సిందే..'' ఈ అంశం చుట్టూ తిరిగే కథే మా చిత్రం అంటున్నారు సుధీర్‌ వర్మ.
ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణముర ళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌., ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌., ఆర్ట్‌: నారాయణరెడ్డి., కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు., నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌., కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ.

పార్టీ లో ఫన్: ప్రకాష్ రాజ్, శ్రీనువైట్ల కలిసి..(ఫొటోలు)

హైదరాబాద్ :మొన్నటిదాకా ఎడమొహం పెడమొహంగా ఉన్న దర్శకుడు శ్రీను వైట్ల, నటుడు ప్రకాష్‌రాజ్‌ మళ్లీ ఒక్కటయ్యారు. ప్రకాష్‌రాజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఇటీవల జరిగిన వేడుకకు శ్రీను వైట్ల హాజరయ్యారు. తన పాత మిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు చిత్ర సీమలో భేదాభిప్రాయాలతో విడిపోయిన స్నేహితులు మళ్లీ కలుసుకున్నారు. దోస్త్‌ మేరా దోస్త్‌... అంటూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. 'ఆగడు' సినిమా సెట్‌లో చోటు చేసుకొన్న ఓ సంఘటనతో శ్రీను వైట్లకీ, ప్రకాష్‌రాజ్‌కీ మధ్య భేదాభిప్రాయాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఒకరినొకరు విమర్శించుకొన్నారు. అయితే ఇప్పుడు ఆ వివాదాన్ని మరిచిపోయి మిత్రులయ్యారు. అలాగే ఇదివరకు విడిపోయిన శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్‌-గోపీమోహన్‌లు కలిశారు. రామ్‌చరణ్‌ సినిమా కోసం వీళ్లంతా కలిసి పనిచేస్తున్నారు.


'మా' ఎన్నిక‌: వచ్చిన హీరోలు,ఆర్టిస్టులు (ఫొటోలు)

హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌లో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగింది. తెలుగు మూవీ ఆర్టిస్టుల సంఘంలోని మొత్తం 702 ఓట్లకు గాను 394 ఓట్లు పోలయ్యాయి. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(ఈవీఎం)ల ద్వారా పోలింగ్‌ నిర్వహించారు. ఒకరిద్దరు మినహా స్టార్ హీరోలెవ్వరూ ‘మా' ఎన్నికలపై అంతగా ఆసక్తి చూపలేదు. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు సినీ నటులు బాలకృష్ణ, మురళీమోహన్‌, నాగబాబు, ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు, లక్ష్మీప్రసన్న, కృష్ణంరాజు, బ్రహ్మానందం, రావు రమేశ్‌, అజయ్‌, గిరిబాబు, రవిబాబు తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 'మా' అధ్యక్ష ఎన్నికపై సినీ పరిశ్రమతో పాటు తెలుగు ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అధ్యక్ష పదవి రేసులో నటుడు రాజేంద్రప్రసాద్‌, నటి జయసుధతో పాటు బొమ్మరిల్లు ధూళిపాళ్ల అనే మరో నటుడు ఉన్నారు. మా ఎన్నికల నిర్వహణ న్యాయస్థానం పరిధిలోకి చేరినందువల్ల ఇవాళ పోలింగ్‌ మాత్రమే జరిగింది. ఫలితాలు కోర్టు తుది తీర్పు తర్వాత వెల్లడయ్యే అవకాశముంది.


టాలీవుడ్‌పై బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్


హైదరాబాద్: తెలుగులో ‘రక్త చరిత్ర', ‘ధోని', ‘లెజెండ్' చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ముంబై భామ రాధిక ఆప్టే. ఇటీవల రాధిక ఆప్టే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక తెలుగులో తప్ప మిగతా అన్ని రీజనల్ లాంగ్వేజీల్లోనూ వర్క్ బాగా ఎంజాయ్ చేసానని, తెలుగు సినీ పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువ అంటూ కామెంట్ చేసింది. ‘తెలుగు సినీ పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువ. వారు అహంకార పూరితంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో నన్ను చాలా బ్యాడ్ గా ట్రీట్ చేసారు అని వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొవడం నా వల్ల కాదు. అందుకే తెలుగు సినిమా పరిశ్రమలో చేయడానికి పెద్దగా ఆసక్తి లేదు' అని వ్యాఖ్యానించారు. మరి రాధిక ఆప్టే ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది? ఆమె ఇబ్బంది పడేలా తెలుగు సినీ పరిశ్రమలో ఎవరు వ్యవహరించారు? అనేది హాట్ టాపిక్ అయింది.
ఆ సంగతి పక్కన పెడితే ఈ మధ్య కాలంలో పలు ఇంటర్వ్యూలో రాధిక బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో వ్యక్తిగా మారుతోంది. సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడటం మన దగ్గర పెద్ద ఇష్యూ. అందుకే సినిమాల్లో దాన్ని వ్యాపారం చేసి అమ్ముకుంటున్నారు. ఆకలేస్తే అన్నమెలా తింటామో... శరీరానికి సెక్స్ కూడా కనీస అవసరం. ఇది ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే. బాలకృష్ణ సరసన లెజండ్, ఇప్పుడు లయిన్ చిత్రాల్లో చేసిన ఈ రక్త చరిత్ర చిన్నది చాలా విషయాల్లో బోల్డ్ గ మాట్లాడి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వరుణ్‌ధావన్ లేటెస్ట్ హిట్ 'బాదల్‌పూర్'లో అందాలు ఆరబోసి ఆకట్టుకున్న రాధికా ఆప్టే... రీసెంట్‌గా రిలీజైన 'హంటర్' సినిమాలో సెక్స్ ఎడిక్ట్‌గా నటించింది. ఆ ఎఫెక్టో లేక సినిమా ప్రమోషన్ కోసమో కానీ... ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఓపెన్‌మైండెడ్‌గా మాట్లాడేస్తోంది.

పాక్ నుండి ఆసిస్ వరకు: ప్రపంచ కప్‌లో భారత్ (పిక్చర్స్)



న్యూఢిల్లీ: భారత అభిమానుల ప్రపంచ కప్ ఆశలు నీరుగారాయి. గురువారం నాడు సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడి ఇంటి దారి పట్టింది.
లీగ్ దశలో ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడిన భారత్.. వరుసగా ఏడు మ్యాచులు గెలిచింది. అనంతరం గురువారం ఆసిస్‌తో మ్యాచ్ ఓడింది. ఈ ఓటమి నేపథ్యంలో కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మను కూడా అభిమానులు నిందించారు.
లీగ్ దశలో... పాకిస్తాన్ పైన 79 పరుగులతో, సౌతాఫ్రికాతో 130 పరుగులతో, యూఏఈతో 9 వికెట్లతో, వెస్టిండీస్‌తో 4 వికెట్లతో, ఐర్లాండ్‌తో ఎనిమిది వికెట్లతో, జింబాబ్వేతో 6 వికెట్లతో గెలిచింది. క్వార్టర్‌లో బంగ్లాదేశ్ పైన 109 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. సెమీస్‌లో ఆసిస్ చేతిలో 95 పరుగుల తేడాతో ఓడింది.

మీ సోషల్ నెట్‌వర్క్‌లో దీన్ని షేర్ చేయండి
హైదరాబాద్ :"లైఫ్ లో పైకిరావాలంటే రెండే రెండు రూల్స్..అందులో నెంబర్ వన్ ఏమిటంటే...మనకు తెలిసింది అంతా వేరే వాళ్లకు చెప్పకూడదు", సుధీర్ బాబు హీరోగా తెరకెక్కబోతున్న ‘మోసగాళ్లకు మోసగాడు' చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. స్వామి రారాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సుధీర్ బాబు సరసన నందిని అనే కొత్తమ్మాయి హీరోయిన్‌. చక్రి చిగురుపాటి నిర్మాత‌. బోస్ నెల్లూరి ద‌ర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం ప్రోమో ఉగాది సందర్భంగా ఈ రోజు విడుదల చేసారు. మీరు ఓ లుక్కేయండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు కృష్ణ హీరోగా1971లో రూపొందిన 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. తెలుగు తెరపై కౌబారు కథాంశంతో రూపొందిన తొలి సినిమాగా ఖ్యాతినార్జించిన ఈ చిత్రం దాదాపు నలభైనాలుగేళ్ల విరామం తర్వాత ఇదే టైటిల్‌తో కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు ఓ సినిమా చేస్తున్నారు.
మ్‌ కామెడీ ఎంటరటైనర్‌గా 2013లో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'స్వామిరారా' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద చక్కటి విజయాన్ని నమోదు చేసుకుంది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయాన్ని సాధించిన ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్‌ రూపొందుతుంది. సుధీర్‌బాబు, నందిని జంటగా నటిస్తున్న ఈ సీక్వెల్‌కు 'మోసగాళ్లకు మోసగాడు' అనే టైటిల్‌ ఖరారు చేసి ఇలా ప్రోమో వదిలారు. కృష్ణ మాట్లాడుతూ... నేను హీరోగా నటించిన 'మోస గాళ్లకు మోసగాడు' ముప్పై సార్లు విడుదలై మంచి వసూళ్లను సాధించింది. అదే పేరుతో వస్తోన్న ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి అన్నారు.

దారుణం: చెట్టుకు కట్టేసి భర్త ఎదుటే భార్యపై ఐదుగురు గ్యాంగ్‌రేప్

నమక్కల్: తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాసిపురం సమీపంలో ఓ మహిళపై ఆమె భర్త ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. షాపింగ్ చేసుకొని తిరిగి తన భర్తతో ఇంటికి వస్తున్న సమయంలో వారిని అడ్డగించిన ఐదుగురు నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ‘ఆ దుండగులు సదరు దంపతులపై దాడి చేశారు. మహిళ భర్తను చెట్టుకు కట్టేసి.. అతని ఎదుటే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు' అని నమగిరిపెట్టాయి పోలీసులు తెలిపారు.

బాధిత మహిళ బంధువులు, ఇరుగుపొరుగు వారు నమక్కల్ జిల్లా ఎస్పీ ఎస్ఆర్ సెంథిల్ కుమార్‌ను కలిసి ఘటనపై ఫిర్యాదు చేశారు. నిందితులపై కేసు నమోదు చేయాలని ఆయన నమగిరిపెట్టాయి పోలీసులను ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, మంగళవారం ఉదయం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు నమగిరిపెట్టాయి పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
వరల్డ్ కప్: టీమిండియా సూపర్ ఫ్యాన్ సుధీర్‌ను జరిమానా నుంచి రక్షించిన సచిన్ లెటర్



ఆక్లాండ్: భారత్ ఏ దేశంలో క్రికెట్ ఆడుతుంటే ఆ దేశంలో ఒంటి నిండా భారతదేశ జెండా రంగుతో సుధీర్ గౌతమ్ కనిపిస్తాడు. స్వతహాగా సచిన్ టెండూల్కర్‌కు వీరాభిమాని అయిన సుధీర్ గౌతమ్‌ను చాలా సందర్భాల్లో సచిన్ టెండూల్కర్ జరిమానాల నుంచి రక్షించాడు. ఐతే ప్రస్తుతం ఆస్టేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్ ఆడకున్న న్యూజిలాండ్‌లో సూపర్ ఫ్యాన్ సుధీర్‌ గౌతమ్‌ను జరిమానా నుంచి సచిన్ టెండూల్కర్ లెటర్ రక్షించింది. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్‌లో భారత్‌కు మద్దతుగా సుధీర్ గౌతమ్ స్టేడియాల్లో జాతీయ జెండాను ఊపుతూ క్రికెట్ అభిమానులకు ఛీర్ చేయడం చూశాం. పెయింట్ బాటిల్స్‌ను తీసుకెళ్తున్న సుధీర్ గౌతమ్‌ను ఆక్లాండ్‌ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం న్యూజిలాండ్ కస్టమ్స్ పోలీసులు ఆపి, అతనికి రూ. 65,000 జరిమానా విధించారు.
దాంతో షాక్‌కు గురైన సుధీర్, తన వద్ద అంత డబ్బు లేదని పోలీసులను బ్రతిమలాడాడు. అంతే కాదు టీమిండియాకు తాను సూపర్ ఫ్యాన్‌ అని, జట్టు ఎక్కడికి వెళ్తే తాను కూడా ఒంటిపై జాతీయ జెండా రంగుతో అక్కడికి వెళ్తానని పోలీసులకు తెలిపాడు. అయినా సరే రూల్‌ను అతిక్రమించావు కాబట్టి జరిమానా కట్టాల్సిందేనని వారు తనపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిపాడు. దీంతో వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా సచిన్ టెండూల్కర్ స్వయంగా రాసిచ్చిన లెటర్‌ను కస్టమ్స్ అధికారులకు చూపించడంతో జరిమానా నుంచి తప్పించుకున్నాడు. ఆస్టేలియా-న్యూజిలాండ్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ వరల్డ్ కప్ 2015లో సుధీర్ గౌతమ్‌కు ఎలాంటి వీసా సమస్యలు రాకుండా ఉండేందుకు సచిన్ టెండూల్కర్ స్వయంగా ఓ లెటర్‌ను సుధీర్‌కు రాసిచ్చాడు. మార్చి 6న పెర్త్‌లో భారత్ Vs వెస్టిండిస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ఫ్లాగ్‌పోల్ విషయంలో తాను సమస్యను ఎదుర్కొన్నానని తెలిపాడు. ప్లాగ్‌పోల్‌ని ఉపయోగించనని చెప్పిన తర్వాతే స్టేడియంలోకి తనకి అనుమతిచ్చినట్లు సుధీర్ గౌతమ్ తెలిపాడు.

అదీ మ్యాటర్: మహేష్ నెక్ట్స్ మాతోనే అని ప్రకటన


హైదరాబాద్ : మహేష్,శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో "బ్రహ్మోత్సవం" అనే చిత్రాన్ని పివిపి వారు నిర్మించనున్న సంగతి తెలిసిందే. అయితే మహేష్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో కానీ, పూరి తో కానీ చెయ్యబోతున్నారని వార్తలు మీడియాలో మొదలయ్యాయి. శ్రీమంతుడు చిత్రం ఫ్యామిలీ చిత్రం కాబట్టి నెక్ట్స్ మళ్లీ కుటుంబ కథా చిత్రం చేయడని కాబట్టి "బ్రహ్మోత్సవం" కు కొంత సమయం పడుతుందని లాజిక్ లు మొదలయ్యాయి. అయితే నిర్మాత పివీపి ఈ విషయమై స్పష్టత ఇచ్చారు.
పిపిపి సినిమా సంస్ధ అథిపతి పొట్లూరి వర ప్రసాద్ తన తదుపరి చిత్రం "బ్రహ్మోత్సవం" అని ప్రకటించి ఖరారు చేసి ఈ రూమర్స్ కు తెరదించారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళబోతోందని చెప్పుకొచ్చారు. దాంతో ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చినట్లైంది.
అలాగే... కొద్ది రోజుల క్రితం పి.వి.పి సంస్థ ఈ సినిమా కోసం కాస్టింగ్‌ కాల్‌ ఇచ్చింది. ఈ చిత్రంలో నటించడానికి 15 నుంచి 50 సంవత్సరాల వయస్సులోపు మేల్‌, ఫీమేల్‌ ఆర్టిస్టులు కావాలని ప్రకటించారు. ఆసక్తి కలవారు ఫుల్ సైజ్, క్లోజప్ ఫోటోతో కాంటాక్ట్ చేయాల్సిందిగా ప్రకటించారు. పైన ఫొటోలో ఉన్న మెయిల్ ఐ.డికి ఫోటోలు పంపించవచ్చు. ఈ సినిమా మహేష్ బాబుతోనే అయితే... తనతో తెరపంచుకునే అవకాశం కొత్త వారికి కలుగుతుంది.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘బ్రహ్మోత్సవం'. పివిపి సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
‘బ్రహ్మోత్సవం'లో మహేష్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైనట్టు వార్తలు వచ్చాయి. వాటిని చిత్ర బృందం ఇంకా ఖరారు చేయలేదు. ఈ సినిమాలో రావు రమేష్ కీలక పాత్రలో నటించనున్నారు. మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
మహేష్ 'శ్రీమంతుడు'తాజా విశేషాలకు వస్తే...
మహేష్‌బా బుహీరోగా మై త్రీ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శ్రుతి హాసన్‌ కథానాయిక. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ సాగుతోంది. మహేష్‌, శ్రుతిలతో పాటు జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, సుకన్య తదితరులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇటీవల పొల్లాచిలో కొన్ని సన్నివేశాలు, పోరాట ఘట్టాలూ చిత్రీకరించారు.
షూటింగ్‌ తుది దశకు చేరుకొంటోంది. ఈ చిత్రానికి 'శ్రీమంతుడు' అనే పేరు పరిశీలిస్తున్నారు. సినిమాలో మహేష్‌ ధనవంతుడిగా కనిపిస్తారని, ఆయన పాత్ర చాలా స్త్టెలిష్‌గా ఉంటుందని చెబుతున్నారు. అయితే టైటిల్‌పై చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అలీ, వెన్నెల కిషోర్‌, సితార, తులసి తదితరులు నటిస్తున్నారు. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.
కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడంటున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్‌ శైలికి తగ్గట్టుగా మాస్‌ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు.
ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, సుకన్య, అలీ, వెన్నెల కిషోర్‌, సితార, తులసి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

వరల్డ్ కప్: లీగ్ మ్యాచ్‌ల తర్వాత వరల్డ్ కప్ 2015 గణాంకాలు

ఐసీసీ వరల్డ్ కప్‌ 2015లో ఇప్పటి వరకు లీగ్ దశలో 42 మ్యాచ్‌లు ముగిశాయి. టోర్నమెంట్ డబుల్ సెంచరీ కలుపుకుని మొత్తం 35 సెంచరీలను క్రికెట్ అభిమానులు వీక్షించారు. ఈ ప్రపంచ కప్‌లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. మొత్తం వరల్డ్ కప్‌లో 14 జట్లు పాల్గొంటే, లీగ్ దశ నుంచి 6 జట్లు ఇంటికి వెనుదిరిగాయి. మిగతా 8 జట్లు టోర్నమెంట్లో భాగంగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. ఇప్పటి వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన 42 మ్యాచ్‌ల గణాంకాలు చూద్దాం.

వరల్డ్ కప్ 2015లో లీగ్ దశ గణాంకాలు: బ్యాటింగ్: ఎక్కువ పరుగులు - 496 - Kumar Sangakkara (Sri Lanka) in 6 innings ఎక్కువ సెంచరీలు - 4 (four in four matches) - Sangakkara అత్యధిక స్ట్రయిక్ రేట్ - 190.37 - Glenn Maxwell (Australia) అత్యధిక వ్యక్తిగత స్కోరు - 215 - Chris Gayle (West Indies) Vs Zimbabwe in Canberra అత్యధిక 50లు - 4 - Sean Williams (Zimbabwe) అత్యధిక సిక్సులు - 20 - AB de Villiers (South Africa) అత్యధిక ఫోర్లు - 54 - Sangakkara బెస్ట్ యావరేజి - 150.00 - Sarfraz Ahmed (Pakistan) మొత్తం సెంచరీలు - 35 మొత్తం డకౌట్‌లు - 3 - Krishna Chandran (United Arab Emirates) in 5 innings అత్యధిక భాగస్వామ్యం - 372 runs - Gayle and Marlon Samuels for the 2nd wicket against Zimbabwe in Canberra ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు - 16 - Gayle Vs Zimbabwe బౌలింగ్: అత్యధిక వికెట్లు - 16 - Mitchell Starc (Australia) in 5 innings నాలుగు వికెట్లు తీసినది - 2 - Starc ఒక ఇన్నింగ్స్‌లో బెస్ట్ బౌలింగ్ - 7/33 - Tim Southee (New Zealand) అత్యుత్తమ ఎకానమీ - 2.80 - Michael Clarke (Australia) మెయిడిన్స్ - 11 - Trent Boult (New Zealand) బెస్ట్ యావరేజి - 8.50 - Starc జట్టు: అత్యధిక విజయాలు - 6 - New Zealand and India (both unbeaten in group stage) అత్యధిక వికెట్లు - 60 in 6 matches for India అత్యధిక పరుగులు - 417/6 in 50 overs - Australia Vs Afghanistan in Perth ఫీల్డింగ్: అత్యధిక క్యాచ్‌లు - 8 - Umesh Yadav (India) in 6 innings

జనసేనకు ఏడాది.. ఇంకా ప్రశ్నలు: పవన్ కళ్యాణ్ పోటీపై సస్పెన్స్?

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి నేటికి ఏడాది పూర్తయింది. ఆయన మార్చి 14, 2014న జనసేనను స్థాపించారు. ఈ సందర్భంగా పవన్ తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. తన పార్టీకి, తనకు నిర్మాణాత్మక సూచనలు ఇచ్చి మీడియా సహకరించిందని తెలిపారు. అయితే, జనసేన పార్టీ పైన ఇప్పటికీ చాలామందిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీ స్థాపించి ఏడాది గడుస్తున్నప్పటికీ... ఇప్పటి వరకు స్పష్టమైన క్యాడర్ గానీ, కమిటీలు కాని లేవని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా, ఎన్నికలలో పోటీ ఎప్పటి నుండి అనేది ఇంకా ప్రశ్నగానే మిగిలిందని చెబుతున్నారు. గత ఏడాది పార్టీ ప్రారంభించిన సమయంలో... సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సహా.. పలుచోట్ల ఆయన పార్టీ సభ్యులు పోటీ చేస్తారనే వాదనలు వినిపించాయి. కానీ ఆ తర్వాత ఆయన బీజేపీ - టీడీపీ కూటమికి మద్దతిచ్చారు. నాటి ప్రచారం సమయంలోనే... పవన్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల గురించి మాట్లాడారు.

తాము గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడనేది స్పష్టత లేకపోయినప్పటికీ.. త్వరలో ఎప్పుడైనా జరగవచ్చు. అయినప్పటికీ ఇప్పటికీ జనసేనకు ఎలాంటి కమిటీలు లేకపోవడం, పోటీ పైన స్పష్టత లేదని అంటున్నారు. సనత్ నగర్ నుండి పోటీ చేస్తారా? ఇటీవల కొత్త వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సనత్ నగర్ నియోజకవర్గం నుండి ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పవన్ మాట్లాడుతూ.. అవసరమైతే తానే త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని చెప్పారు. దీంతో అతను లేదా జనసేన పార్టీ పోటీ చేయవచ్చునని అంటున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుండి గెలిచి తెరాసలో చేరారు. ఇప్పుడు ఆయన మంత్రి అయ్యారు. దీంతో ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తే సనత్ నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో టీడీపీ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే, పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేస్తే బాగుంటుందని టీడీపీ, బీజేపీలు కూడా భావిస్తున్నాయి. పవన్ పోటీ చేస్తే తెరాసను గట్టిగా ఢీకొంటారని, తలసాని చిత్తవుతారని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే, సినిమాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ అప్పుడే పోటీకి దిగుతారా అనే అనుమానాలు లేకపోలేదు. టీడీపీ అభ్యర్థికి పవన్ మద్దతుగా మాత్రం నిలబడవచ్చునని అంటున్నారు.
వివాహేతర సంబంధం: కానిస్టేబుల్ భర్తను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన భార్య

గాంధీనగర్: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ పోలీసు కానిస్టేబుల్‌ను ఆయన భార్య క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన సంఘటన గుజరాత్‌లోని కేవడియ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ముఖేష్ ఎస్ బారియా స్ధానిక సర్దార్ సరోవర్ రిజర్వాయర్ వద్ద పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేవాడు. ఆయన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఆయన భార్య సంగీత ప్రతిరోజూ అతనితో గొడవ పడుతుండేదని ఇన్ స్పెక్టర్ వైపీ పటేల్ శనివారం అన్నారు.

ఈ విషయమై నాలుగు రోజుల క్రితం కూడా భార్యభర్తలు గొడవపడ్డారు. ఈ సమయంలో కోపంలో క్రికెట్ బ్యాట్‌తో తన భర్తపై విచక్షణా రహితంగా దాడి చేసింది. అనంతరం ఆమె పోలీస్ స్టేషన్‌కు చేరుకొని తన భర్త అపస్మారక స్ధితిలో పడి ఉన్నాడని పోలీసులకు తెలిపింది. హుటాహుటిని ఇంటికి చేరుకున్న వారు వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

జింబాబ్వేతో మ్యాచ్: మరో మైలురాయి అందుకున్న ధోనీ


బెంగళూరు: భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ మరో మైలురాయి అందుకున్నాడు. ప్రపంచ కప్‌లో భాగంగా భారత్ - జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్ ద్వారా ధోనీ అరుదైన రికార్డ్ అందుకున్నాడు. సచిన్ ఇప్పటి వరకు నాలుగు వందల మ్యాచుల మైలురాయి చేరుకున్నాడు. డిసెంబర్ 23, 2004లో బంగ్లాదేశ్ పైన ఆడిన మ్యాచుతో కెరీర్ ప్రారంభించాడు. ఇప్పుడు జింబాబ్వేతో జరుగిన మ్యాచుతో 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన ఆరో భారత బ్యాట్స్‌మెన్. ధోనీ వికెట్ కీపర్ కూడా కావడం గమనార్హం. ధోనీకి ముందు ఈ ఫీట్ సాధించిన వారిలో... మహమ్మద్ అజహరుద్దీన్, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, సౌరవ్ కంగూలీలు ఉన్నారు. ధోనీ భారత్‌కు.. ట్వంటీ 20 ప్రపంచకప్‌ను 2007లో, ప్రపంచ కప్‌ను 2011లో, ఛాంపియన్స్ ట్రోఫీని 2013లో అందించాడు.

జింబాబ్వేతో ఆడుతున్న మ్యాచ్ ధోనీది 260వ వన్డే. అతను 90 టెస్టులు, 50 ట్వంటీ 20లు ఆడారు. మొత్తం 400. ధోనీ గత ఏడాది డిసెంబర్ నెలలో టెస్టుల నుండి రిటైర్ అయ్యాడు. 400 అంతర్జాతీయ మ్యాచుల మైలు రాయి దాటిన వారిలో... 664 (200 Tests, 463 ODIs, 1 T20I) - సచిన్ టెండుల్కర్ 509 (164 Tests, 344 ODIs, 1 T20I) - రాహుల్ ద్రావిడ్ 433 (99 Tests, 334 ODIs) - మహమ్మద్ అజహురుద్దీన్ 424 (113 Tests, 311 ODIs) - సౌరవ్ గంగూలీ 403 (132 Tests, 271 ODIs) - అనిల్ కుంబ్లే 400 (90 Tests, 260 ODIs, 50 T20Is) - మహేంద్ర సింగ్ ధోనీ

హామీ ఇచ్చి మొండిచేయి చూపిన టీడీపీ: రోజా

హైదరాబాద్: అధికారంలోకి వస్తే అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు తీరుస్తామని చెప్పిన టీడీపీ ఇప్పుడు మొండిచేయి చూపిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు.

శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ సమస్యలపై చర్చకు సమయం కోరితే స్పీకర్‌ అసహనం వ్యక్తం చేశారని అన్నారు. మహిళలు, మహిళాసాధికారత విషయంలో తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు బాధ్యతలు ఎక్కువ...జీతం తక్కువ అనే విధంగా గొడ్డుచాకిరీ చేయిస్తున్నారని మండిపడ్డారు. అంగన్‌వాడీ కార్యకర్తల జీతాల పెంపుపై తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి చూపడం లేదని రోజా వ్యాఖ్యానించారు.

ఏపీ బడ్జెట్: పన్నులేని బడ్జెట్, యనమల ప్రపంచ బ్యాంక్ ప్రస్తావన: రాజధానిపై..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం నాడు శాసన సభలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. మండలిలో మంత్రి నారాయణ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. విభజతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంలో పడిందని యనమల బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో చెప్పారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆయన బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. ఏపీ వార్షిక బడ్జెట్ - 1,13,049 కోట్లు ప్రణాళికా వ్యయం - 34,413 కోట్లు ప్రణాళికేతర వ్యయం - 78,637 కోట్లు ఆర్థిక లోటు - 17,584 కోట్లు రెవెన్యూ లోటు -7300 కోట్లు రాజధానిపై... 33252 ఎకరాల్లో రాజధాని నిర్మాణం, ప్రభుత్వ భూమి 7వేల ఎకరాలే, స్థిర ఉపాధి, స్వయంపోషక రాజధాని ఏర్పాటు, 25 శాతం అభివృద్ధి చేసిన రైతులకే, కొత్త రాజధానికి 3168 కోట్లు, రాజధాని భూసమీకరణ అభివృద్ధికి 303.26 కోట్లు, మెట్రోకు... విజయవాడ, విశాఖ మెట్రోలకు రూ.300 కోట్లు విభజనపై... విభజన వల్ల కోల్పోయిన వనరులు మళ్లీ తెచ్చుకునేవి కావు, విభజనతో అనేక సమస్యలు, సంక్లిష్టతలు ఎదుర్కొంటున్నాం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వ్యాఖ్యలతో ప్రసంగం ప్రారంభించిన యమనమల.. మహాత్మా గాంధీ వ్యాఖ్యలతో ప్రసంగం ముగించారు. ప్రపంచ బ్యాంక్‌ను టీడీపీ ప్రభుత్వం మరోసారి పలికింది. హుధుద్ తుఫాను విషయంలో ఏపీ సీఎం చంద్రబాబును కొనియాడి, ధన్యవాదాలు తెలిపారు. ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీసుకువెళ్తాం

దేవాదాయ శాఖకు రూ.100 కోట్లు గోదావరి పుష్కరాలకు రూ.200 కోట్లు కొత్త రాజధానికి 3168 కోట్లు రవాణా శాఖకు 122 కోట్లు అటవీ శాఖకు 284 కోట్లు హోంశాఖకు 4062 కోట్లు పోలీసు సంక్షేమ నిధికు 40 లక్షలు క్రీడలకు 45 కోట్లు ఐటీకి 370 కోట్లు పర్యాటక శాఖకు 330 కోట్లు విపత్తుల నిర్వహణకు 488 కోట్లు కార్మిక శాఖకు 281 కోట్లు పరిశ్రమలు, వాణిజ్యంకు 637 కోట్లు మెరైన్ అకాడమికీ మచిలీపట్నంలో 300 ఎకరాలు నైపుణ్యాల అభివృద్ధికి 360 కోట్లు గత బడ్జెట్ రెవెన్యూ లోటు 14, 242 కోట్లు ఇంధన శాఖకు 4360 కోట్లు ఉన్నత విద్యకు 3049 కోట్లు సాగునీటికి 5258 కోట్లు విద్యుత్ శాఖకు 4360 కోట్లు 81,397 ఉన్న తలసరి ఆదాయాన్ని 90,517కు పెంచుతాం. మైనార్టీలకు 379 కోట్లు సాంఘీక సంక్షేమానికి 2123 కోట్లు గ్రామీణాభివృద్ధికి 8283 కోట్లు వికలాంగుల సంక్షేమానికి రూ.81 కోట్లు గిరిజన సంక్షేమానికి 933 కోట్లు చేనేత, జౌలీఖి 46 కోట్లు పౌర సరఫరాలకు 2459 కోట్లు పాఠశాలకు 14962 కోట్లు గృహ నిర్మాణానికి 892 కోట్లు పట్టణాభివృద్ధికి 3168 కోట్లు గనులు, భూగర్భ 27 కోట్లు ఆరోగ్య శాఖకు 5728 కోట్లు స్త్రీ, శిశు సంక్షేమానికి 1080 కోట్లు గ్రామీణ నీటి సరఫరాకు .881 కోట్లు గిరిజన సంక్షేమానికి 993 కోట్లు మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు 195 కోట్లు ఇంధన శాఖ - 4360 కోట్లు ఆరోగ్య శాఖకు 2578 కోట్లు బీసీ సంక్షేమానికి 3231 కోట్లు ఇంటర్ విద్యకు 585 కోట్లు 33252 ఎకరాల్లో రాజధాని నిర్మాణం. 25 శాతం అభివృద్ధి చేసిన రైతులకే ప్రభుత్వ భూమి 7వేల ఎకరాలే స్థిర ఉపాధి, స్వయంపోషక రాజధాని ఏర్పాటు ఆర్ అండ్ బీకి 2960 కోట్లు 2050 నాటికి పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా ఏపీ తమిళనాడు తరహాలో ఎక్సైజ్ విధానం వైద్య ఆరోగ్య శాఖకు 3.97 నుండి 5.07 శాతం నిధులు పెంపు 2029 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీ పన్నేతర అదనపు ఆదాయం సమకూర్చుతాం బడ్జెట్లో పన్ను భారం లేదు పాఠశాల విద్యకు 11.36 నుండి 13.24కు పైగా నిధుల పెంపు ఆర్ అండ్ బీకి 2960 కోట్లు విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాల ఆధునికీకరణ బ్రాహ్మణుల సంక్షేమానికి 35 కోట్లు ఈ ఏడాది సోలార్ పంపు సెట్లు నెలకొల్పాలని నిర్ణయం డ్వాక్రా మహిళలకు నాలుగు రెట్లు అధిక రుణాలు ఇచ్చే ప్రణాళిక రెండో దశ రుణమాఫీపై కసరత్తు చేస్తున్నాం పీపీపీ పద్ధతుల్లో 2వేల కిలోమీటర్ల రహదారులు బోగాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ ప్రతిపాదన మురికి వాడలు లేని పట్టణాలు లక్ష్యంగా గృహ నిర్మాణ శాఖ లక్ష్యం కుప్పం, దగదర్తి, ఓర్వకల్లులో విమానాశ్రయాల ప్రతిపాదన రేషన్ కార్డులను ఆధార్ కార్డులను అనుసందానం చేసేందుకు ప్రత్యేక చర్యలు మున్సిఫల్ శాఖకు 3168 కోట్లు రాజధాని భూసమీకరణ అభివృద్ధికి 303.26 కోట్లు రైతుల ప్రయోజనం కోసం అత్యధిక ప్రాధాన్యత తగినన్ని ధాన్యాల కొనుగోలు కేంద్రాలు, 14 లక్షల మెట్రో టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశాం అత్యవసర వస్తువుల ధరలు నియంత్రించేందుకు చర్యలు నల్ల బజారు పైన చర్యలు ఎన్టీఆర్ పథకం ద్వారా వైద్య సేవలు (108) వైద్య ఆరోగ్య శాఖకు బడ్జెట్లో గణనీయ ప్రాధాన్యత విజయవాడ, విశాఖ మెట్రోలకు రూ.300 కోట్లు కాపుల సంక్షేనికి రూ.100 కోట్లు జాతీయ ఆరోగ్య మిషన్ కింద మాతా శిశు ఆరోగ్యం మున్సిపాలిటీ నీటి సరఫరా, పారిశుద్ధ్యానికి రూ.722 కోట్లు వ్యవసాయానికి 7307 కోట్లు పట్టణాభివృద్ధికి 367.66 కోట్లు కార్మిక శాఖకు రూ.281 కోట్లు అనేక సమస్యలు, సంక్లిష్టతలు ఎదుర్కొంటున్నాం సేవారంగంలో వృద్ధి రేటు 8.48 శాతం షెడ్యూలు తెగలకు 1904 కోట్లు పలు జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.35 కోట్లు పరిశ్రమల రంగంలో 5.25శాతం వృద్ధి సాధించాం షెడ్యూల్ కులాలకు 5878 కోట్లు పాఠ్యాంశాలను టీవీ ద్వారా ప్రసారం చేసేందుకు ప్రణాళికలు సాంకేతిక విద్యా శాఖ పరిధిలో పని చేస్తున్న కళాశాలలో రిపోర్ట్ కేంద్రాలు విభజన వల్ల కోల్పోయిన వనరులు మళ్లీ తెచ్చుకునేవి కావు సేవారంగంలో 8.48 శాతం వృద్ధి రేటువైద్య, పాఠశాల విద్యకు 2 శాతం పెంచాం వెనుకబడిన వర్గాలను దారిద్రం నుండి బయటపడేసే ప్రణాళిక వ్యవసాయంలో 5.90 శాతం వృద్ధి రేటు సాధించాం మున్సిపల్ శాఖలో ప్రణాళిక వ్యయం 553 కోట్లు వ్యవసాయ బడ్జెట్ ప్రణాళికేతర వ్యయం 5905 కోట్లు నీటి పారుదల శాఖ ప్రణాళిక వ్యయం 4056 కోట్లు చిన్న నీటి పారుదల శాఖ ప్రణాళికేతర వ్యయం 608 కోట్లు గ్రామీణాభివృద్ధి ప్రణాళికా వ్యయం 8209 కోట్లు పంచాయతీ రాజ్ ప్రణాళికా వ్యాయం 995.43 కోట్లు మున్సిపల్ శాఖ ప్రణాళిక వ్య్యం 553 కోట్లు వ్యవసాయ ప్రణాళిక వ్యయం 1402.58 కోట్లు గ్రామీణాభివృద్ధి బడ్జెట్ 5213 కోట్లు 177 పాఠశాలల్లో 1.22 లక్షల మంది విద్యార్థులకు గుణాత్మక విద్య విభజనతో కోల్పోయిన వనరులు తెచ్చుకోలేం ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంతో ప్రజలకు రక్షిత మంచినీరు విభజనతో అనేక సమస్యలు, సంక్లిష్టతలు ఎదుర్కొంటున్నాం నిత్యావసర ధరలు నియంత్రణకు చర్యలు అన్న అమృత హస్తం పథకానికి 104 కోట్లు 2014-15 నాటికి మత్స్య రంగ వృద్ధి రేటు 17.3 శాతం రైతుల రుణమాఫీకి రూ.5వేల కోట్లు విడుదల తుంగభద్ర ప్రాజెక్టుకు రూ.20కోట్లు పులివెందుల కాలువకు 5.7 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు రూ.1294 కోట్లు గాలేరు - నగరి ప్రాజెక్టుకు 169 కోట్లు మైలవరం కాలువకు 5.97 కోట్లు తెలుగు గంగకు 205 కోట్లు వెనుకబడినతరగతుల కోసం ఉప ప్రణాళిక రూపకల్పన మైనార్టీ సంక్షేమానికి దుకాన్ మకాన్, రోష్నీ తదితరాలు... అన్న హస్తం పథకం కింద 3.54 లక్షల మంది మహిళలకు ఆహారం సముద్ర జలాల్లోకి వృథాగా పోయే నీటిని సద్వినియోగం 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 కంపెయిన్లపై బడ్జెట్లో ప్రాధాన్యత పర్యాటక రంగం అభివృద్ధికి ప్రయివేటు పెట్టుబడులకు ప్రోత్సాహం బెజవాడలోని భవానీ ద్వీపం అభివృద్ధి వివిధ జిల్లాల్లోని పలు పర్యాటక కేంద్రాలు, పలు సముద్ర తీరాలలో పర్యాటక రంగానికి ప్రోత్సాహం ఏపీలో హస్తకళలను ప్రోత్సహిస్తాం కడప, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల్లో శిల్పారామాలు సంక్రాంతిని రాష్ట్ర పండుగగా నిర్వర్తించాం సంగీత నాటక అకాడమీ, లలిత అకాడమీలను నిర్మిస్తాం, వీటి కోసం 330 కోట్లు అన్ని మిషన్లను సఫలం చేసేందుకు వివిధ శాఖల నైపుణ్యం పెంచేందుకు, శాఖల మధ్య సమన్వయం కోసం నైపుణ్యాల శాఖ 17 నైపుణ్య శిక్షణ కేంద్రాలు, ఉపాధి తదితరాలకు ఉపయోగపడుతుంది ఐటీ పరిశ్రమల శీఘ్ర అభివృద్ధికి ప్రణాళిక, ఇన్నోవేషన్ సంస్థ నెలకొల్పాం హుధుద్ తదితర తుఫాను అనంతరం వాటి నష్టాన్ని అంచనా వేశాం స్మార్ట్ విలేజ్ కోసం ఓ పోర్టల్ కొత్త పారిశ్రామికవేత్తలకు అండ కోసం మదురవాడ ఐటీ లే అవుట్లో ఓ సంస్థ దేశ, ప్రపంచవ్యాప్తంగా ఐటీ దిగ్గజాలను పెట్టుబడుల కోసం ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేశాం, పలు సంస్థలు ముందుకు వచ్చాయి యువతకు సీఎంఈవై పథకం ఎకో డెవలప్‌మెంట్ ద్వారా అడవుల పరిరక్షణ ఎర్రచందనం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకున్నాం 33 శాతం అటవీ విస్తీరణ ఉండాలనుకుంటున్నాం, 7.25 శాతం వ్యత్యాసం ఉంది. కాబట్టి చెట్లు నాటి పెంచుతాం యూకలిప్టస్, జీడి మామిడి, కాఫీ తోటల పెంపకానికి ప్రోత్సాహం... ఇందుకోసం 284 కోట్లు విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ఆన్ లైన్ ద్వారా నష్టపరిహారం నెరడి ప్రాజెక్టుకు 52.20 కోట్లు తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టుకు 43 కోట్లు హుధుద్ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నిరుపమాన పాత్రకు ధన్యవాదాలు చెబుతున్నా తుఫాన్ వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించి ధైర్యం చెప్పారు ప్రపంచ బ్యాంక్ సాయంతో అండర్ గ్రౌండ్ కేబులింగ్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో దెబ్బతినకుండా జాగ్రత్తలు 7 జిల్లాల్లో 230 కరువు మండలాలుగా ప్రకటంచాం రహదారుల ప్రమాదాలు తగ్గించేందుకు ప్రచార కార్యక్రమాలు, రహదారుల భద్రతపై అవగాహన రహదారుల భద్రతకు ప్రపంచ బ్యాంకు సాయంతో పైలట్ ప్రాజెక్ట్, ఇందుకు 122 కోట్లు వంశధార ప్రాజెక్టుకు రూ.17.99 కోట్లు తోటపల్లి ప్రాజెక్టుకు 161.98 కోట్లు తుంగవిపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ఆన్ లైన్ ద్వారా నష్టపరిహారం నెరడి ప్రాజెక్టుకు 52.20 కోట్లు తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టుకు 43 కోట్లు హుధుద్ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నిరుపమాన పాత్రకు ధన్యవాదాలు చెబుతున్నా తుఫాన్ వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించి ధైర్యం చెప్పారు ప్రపంచ బ్యాంక్ సాయంతో అండర్ గ్రౌండ్ కేబులింగ్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో దెబ్బతినకుండా జాగ్రత్తలు 7 జిల్లాల్లో 230 కరువు మండలాలుగా ప్రకటంచాం రహదారుల ప్రమాదాలు తగ్గించేందుకు ప్రచార కార్యక్రమాలు, రహదారుల భద్రతపై అవగాహన ఒంగోలు చీఫ్ ఇంజనీర్ పరిధిలోని కాలువకు రూ.153.89 కోట్లు దేవాలయాలలో దూపదీప నైవేధ్యాలు గోదావరి పుష్కరాల సమయంలో శాఖల మధ్య సమన్వయం, వివిధ శాఖలు పనులు చేపట్టాయి.

బంపర్ రికార్డ్: భారత్-పాక్ మ్యాచ్ ఆదాయం రూ.110 కోట్లు!
న్యూఢిల్లీ: ప్రపంచ కప్‌లో భాగంగా భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌ను రికార్డ్ స్థాయిలో అభిమానులు చూసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారమైంది. దూరదర్శన్‌లోను మ్యాచ్ వీక్షించారు. ఈ మ్యాచ్‌కు వాణిజ్య ప్రకటనల రూపంలో రూ.100 కోట్ల నుండి 110 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ సమయంలో వాణిజ్య ప్రకటనలకు పది సెకన్లకు గరిష్టంగా రూ.25 లక్షలు తీసుకున్నారు. 93 సంస్థలు తమ ఉత్పత్తులకు ప్రచారం చేసుకున్నాయి. హెచ్‌డీ ఫీడ్స్‌లో పది సెకండ్లకు 16 నుండి 18 లక్షలు వసూలు చేశారు. రీజినల్ ఫీడ్స్‌లో రూ.1.25 లక్షల వరకు వసూలు తీసుకున్నారు.

మీడియా ప్లానర్స్ ఎస్టిమేషన్ ప్రకారం.. స్టాండర్డ్ ఫీడ్ (స్టార్ స్పోర్ట్స్)కు స్వయంగా దాదాపు రూ.45 కోట్ల నుండి 50 కోట్ల వచ్చి ఉంటాయని, హెచ్‌డీ ఫీడ్, రీజినల్ ఫీడ్స్, డీడీ ఫీడ్స్ ద్వారా మిగతా మొత్తం వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ఈ మ్యాచ్ ద్వారా రూ.40 కోట్ల రెవెన్యూ స్టార్ ఇండియాకు వచ్చి ఉంటుందని, మిగతా మ్యాచుల ద్వారా రూ.15 నుండి 16 కోట్ల వరకు వస్తుంటుందని అంచనా వేస్తున్నారు.

బాబు మంచి పని చేశారు, గౌరవంగా చూడాలన్నా: కేసీఆర్, ఏపీవారితో మాకే లాభం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనకు విద్యుత్ ఇవ్వకుండా మంచి పనే చేశారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. చంద్రబాబు ఇప్పుడు కరెంట్ ఇచ్చినా తీసుకోమన్నారు. ఏపీ సీఎం చంద్రబాబును, మంత్రులను గౌరవంగా చూడాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. విద్యుత్ ఇవ్వకుండా చంద్రబాబు మంచి పని చేశారని, వచ్చే ఏడాది నాటికి తెలంగాణలో మిగులు విద్యుత్ ఉంటుందన్నారు. వచ్చే ఏడాది మార్చి నుండి రైతులకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ ఇస్తామని చెప్పారు. సచివాలయానికి వాస్తు లేదంటే నానా యాగీ చేశారని మండిపడ్డారు. కొత్త సచివాలయం కట్టి చూపిస్తామని చెప్పారు. నూటికి నూరు శాతం కొత్త సచివాలయం కడతామన్నారు. హెచ్ఓడీలన్నీ ఒకేచోట ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు. నార్కట్‌పల్లి ఓసీటీఎల్‌ను మూతపడనీయమని చెప్పారు. షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే తీసుకొని రైతులకు జాతీయం చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తెలంగాణ ప్రభుత్వానికి శాశ్వత టూరిస్ట్‌లు అన్నారు. వారు మరో నాలుగున్నరేళ్లు ఇక్కడే ఉన్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఏపీ ప్రభుత్వం నుండి జీతాలు తీసుకొని తెలంగాణ ప్రభుత్వానికి ట్యాక్స్‌లు కడితే మాకే మంచిదన్నారు. హైకోర్టు విషయంలో పదిహేను రోజుల్లో శుభవార్త వస్తుందని చెప్పారు. ఆసరాలో అనర్హులు పెన్షన్ తీసుకుంటే ఫిర్యాదు చేయాలన్నారు. అధికారుల పైన చర్యలుంటాయన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పైన రేపు వ్యాప్కో సంస్థ సర్వే చేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు డిజైన్లో లోపాలున్నాయన్నారు. గొప్పలకు పోయి కరవు మండలాలను ప్రకటించమన్నారు. తీవ్రత, వాస్తవాలు తెలుసుకున్నాక వాటిని ప్రకటిస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కమల్ నాథన్ కమిటీ ఉద్యోగు విభజన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఆంధ్రా విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ ఇస్తే ఏమవుతుందని కొందరు అంటున్నారని, అది సరికాదన్నారు. ఇవాళ ఫీజులు ఇస్తే రేపు ఉద్యోగాలకు క్యూ కడతారని చెప్పారు. దీంతో తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం జరుగుతుందన్నారు.

ఎంహెచ్ 370, బీచ్‌లో టవల్ లాంటి ప్యాకెట్: క్లూ దొరికిందా?



కౌలాలంపూర్: గత ఏడాది (2014) మార్చి 8న గల్లంతైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 370కి చెందిన ఓ క్లూ దొరికినట్లుగా తెలుస్తోంది. మంగళవారం నాడు ఆస్ట్రేలియా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఒక చిన్న కర్చీఫ్ లేదా టవల్ లాంటి ప్యాకెట్ కనిపించింది.
దీంతో కొద్దిగా ఆశలు రేకెత్తాయి. ఎంహెచ్ 370 ఎక్కడ కూలుతుందో దీనిని బట్టి తెలియవచ్చునని భావిస్తున్నారు. కింగ్ స్లే, విక్కీ మిల్లర్ అనే దంపతులు సెర్ వాంటెస్ బీచ్ తీరంలో వెళ్తుండగా ఈ ప్యాకెట్ దొరికింది. దీని మీద మలేషియా ఎయిర్ లైన్స్ లోగో కనిపిస్తోంది. దీంతో వారు దానిని పోలీసులకు ఇచ్చారు.
ఆ కర్చీఫ్ లాంటి వస్తువు మలేషియా ఎయిర్ లైన్స్‌కు చెందినదే అయి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఇది సెర్చ్ ఆపరేషన్‌లో ఉపయోగపడే అవకాశాలు లేవని కూడా అంటున్నారు. కాగా, మలేషియా ఎయిర్ లైన్స్ విమానం గల్లంతై ఏడాది దాటింది.

ఆలం విడుదల: సభ్యుల ఆందోళన, కేంద్రానికి ఎలాంటి సమాచారం లేదన్న మోడీ


న్యూఢిల్లీ: వేర్పాటువాదులు, ఉగ్రవాదుల విషయంలో ప్రభుత్వం రాజీపడదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాద నేత మసరాత్ ఆలంను విడుదల చేయడంపై పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం దద్దరిల్లాయి. ఆలం విడుదల విషయంలో లోక్ సభలో విపక్షాలు ఆందోళన నేపథ్యంలో ప్రధాని మోడీ స్పందించారు.

మసరాత్ ఆలం విడుదలపై కేంద్రానికి ఎలాంటి సమాచారం లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో భాగస్వాములమైన కూడా సమాచారం లేదన్నారు. దేశ ప్రజలకు భద్రతపై భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉందని పేర్కొన్నారు. ఉగ్రవాదల దుశ్చర్య కారణంగా మా నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని బలి తీసుకున్న విషయాన్ని గర్తు చేశారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించబోనని ఆయన పేర్కొన్నారు. మసరాత్ ఆలం విడుదలపై ప్రజల్లో వ్యక్తమైన భావాలు, పార్లమెంట్ సభ్యుల ఆందోళనలతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని సమాధానంతో సంతృప్తి చెందిన కాంగ్రెస్ సభ్యులు లోక్ సభలో ఆందోళనను కొనసాగించారు. విపక్షాల ఆందోలన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు మసారత్ ఆలం విడుదలపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్ సభలో ప్రకటన చేశారు.   
'సత్యం' రామలింగరాజు కేసు తీర్పు ఏప్రిల్ 9కి వాయిదా


హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు తీర్పు ఏప్రిల్ 9కి వాయిదా పడింది. నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం, మోసం, నకిలీ పత్రాల అభియోగాలు అప్పటి సత్యం కంప్యూటర్స్ ఛైర్మన్ రామలింగరాజు నమోదయ్యాయి. ఆరేళ్ల నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది. కాగా, సోమవారం కోర్టు తీర్పును ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. కంపెనీ వాస్తవ ఆదాయాన్ని అధికంగా చూపి షేరు ధరను తాత్కాలికంగా భారీగా పెంచేసిన అప్పటి సత్యం కంప్యూటర్స్ ఛైర్మన్ రామలింగరాజు, షేర్ మార్కెట్‌ను మోసం చేశారు. 2009 జనవరి 7న ఒక్కసారిగా వాస్తవం వెలుగులోకి రావడంతో కంపెనీ షేరు భారీగా పడిపోయింది.
దీంతో ఇన్వెస్టర్లు నిండా మునిగిపోయారు. స్టాఫ్ట్‌వేర్ రంగాన్ని పెను కుదుపు కుదిపిన ఈ కేసులో రామలింగరాజు సహా పలువురు అరెస్టయ్యారు. సుదీర్ఘకాలంగా ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు విచారణ ముగిసినట్లు గత డిసెంంబర్ 23న ప్రకటించింది. విచారణలో భాగంగా 3వేల పత్రాలను పరిశీలించిన న్యాయస్థానం 226మంది సాక్షులను విచారించింది. 2015 మార్చి 9న తీర్పు వెలువరించనున్నట్లు వెల్లడించింది. మార్చి 9న ఈ కేసు తీర్పును ఏప్రిల్ 9కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

టీచర్ల నియామక కుంభకోణం: మాజీ ముఖ్యమంత్రి చౌతలాకు పదేళ్ల జైలు


న్యూఢిల్లీ: హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌతాలా, ఆయన కుమారుడు సహా మొత్తం ఏడుగురికి అధ్యాపకుల నియామక కుంభకోణం కేసులో పదేళ్ల కారాగార శిక్షను ఢిల్లీ హైకోర్టు గురువారం ధ్రువీకరించింది. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇంత తీవ్ర స్థాయిలో కుంభకోణానికి పాల్పడటాన్ని చూస్తే దేశ పాలనా వ్యవహారాలు ఎంత దిగ్భ్రాంతికర రీతిలో సాగుతున్నాయో అర్థమవుతోందని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. అయితే గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు పాఠంలో కొన్ని సవరణలు చేసింది. ఈ కేసులో మరో 50మందికి రెండేళ్ల జైలుశిక్షను విధించింది. మొత్తం 400 పేజీల తీర్పును న్యాయమూర్తి సిద్ధార్థ్ మృదుల్ ఇచ్చారు. మొత్తం హర్యానాలోని 18 జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ నియామక వ్యవహారం అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల చేతుల్లోనే సాగిందని, మొత్తం బ్యూరోక్రసీ అంతా దాని అడుగులకు మడుగులొత్తిందని న్యాయమూర్తి తెలిపారు.

కేసుకు సంబంధించి అప్పీళ్లన్నింటినీ తిరస్కరిస్తున్నామని వెల్లడించారు. ముడుపుల కోసం టీచర్ల నియామక ప్రక్రియను చౌతాలా ద్వయంతోపాటు నాటి సీఎం సలహాదారు షేర్‌సింగ్ బాద్‌షామీ, మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు విద్యాధర్, సంజీవ్ కుమార్ అపహాస్యంచేశారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవాల్సిన చౌతాలా వారిని మోసగించినందుకు పదేండ్ల జైలుశిక్షకు అర్హుడేనని పేర్కొంది. వృద్ధుడినైన తనను కనికరించాలన్న ఓంప్రకాశ్ చౌతాలా విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. ఇటువంటి కుంభకోణాలు వ్యవస్థలపై ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని జస్టిస్ సిద్దార్థ్ మృదుల్ ఆందోళన వ్యక్తంచేశారు. నిందితులు దిగ్భ్రాంతికరమైన రీతిలో వ్యవస్థకు తూట్లు పొడిచారన్నారు. 2000లో జరిగిన 3206 మంది టీచర్ల నియామక కుంభకోణంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2003 నవంబర్ 23న సీబీఐ విచారణ చేపట్టింది.
టీడీపీ-బీజేపీ తప్పులో నాకూ బాధ్యత: పవన్, రసాభాస, విరిగిన కుర్చీలు


తుళ్లూరు: సార్వత్రిక ఎన్నికలలో తాను బీజేపీ - టీడీపీ కూటమికి మద్దతిచ్చాని, ఆ పక్షాల తరఫున ఏదైనా తప్పు జరిగితే అందులో తనకు కూడా బాధ్యత ఉంటుందని జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం అన్నారు. ఆయన రాజధాని ప్రాంత రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తుళ్లూరులో ఆయన మాట్లాడారు. రైతులకు ఇష్టంలేని గ్రామాలను రాజధానిలో కలపవద్దని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. రైతులకు న్యాయం జరిగేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. బీజేపీ - టీడీపీ పక్షాల తరఫున తప్పు జరిగితే అందులో తనకూ బాధ్యత ఉంటుందన్నారు. రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాల భూమి అవసరమా అని ప్రశ్నించారు. 15వేల ఎకరాలు కూడా చాలా ఎక్కువే అన్నారు. వైసీపీకి చెందిన గ్రామాల వారే భూసేకరణ వ్యతిరేకిస్తున్నారని కొందరు మంత్రులు చెప్పారని, అయితే రైతులు ఏ పార్టీకి చెందినవారన్నది తనకు ముఖ్యం కాదని, వారికి న్యాయం జరగాలన్నదే తన ప్రధాన ఉద్దేశ్యమన్నారు. రాజకీయాలు అవసరం లేదు కానీ..

తనకు రాజకీయాలు అవసరం లేదని పవన్ అంతకుముందు అన్నారు. అయితే, ప్రజల కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. సినిమాల ద్వారా మీరు నా పైన చూపించే ప్రేమ నాకు చాలన్నారు. కానీ ఇలాంటి వారికి ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. ఇంకా దేహీ అనొద్దు ఏపీకీ ప్రత్యేక హోదా కోసం ఎంపీలు అందరూ కలిసి కట్టుగా పోరాడాలని చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దని హితవు పలికారు. ఇంకెంత కాలం మనం దేహీదేహీ అని అర్తిద్ధామని వ్యాఖ్యానించారు. కాగా, రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్.. ఎక్కువగా రైతులతోనే మాట్లాడిస్తున్నారు. ఉండవల్లి పర్యటన రసాభాస పవన్‌ కళ్యాణ్‌ పర్యటన రసాభాసగా మొదలైంది. ఉండవల్లిలో పవన్‌ పాల్గొన్న మొదటి సభ అభిమానుల అత్యుత్సాహం కారణంగా కొంత ముందుగానే ముగిసింది. పవన్‌ వచ్చినప్పటి నుంచి అభిమానులు గందరగోళం సృష్టించారు. దీంతో పవన్‌ ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాలేదు. సభా ప్రాంగణంలో తగిన ఏర్పాట్లు చేయడంలో పోలీసులు విఫలం కావడంతో సభలో గందరగోళం జరిగింది. దీంతో పవన్‌ సైతం అసహనం వ్యక్తం చేశారు. పవన్‌తో తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన రైతులు సభ ముందుగానే ముగియడంతో తీవ్ర నిరాశ చెందారు. ఎంతో ఆశగా సమస్యలు చెప్పుకుందామని వస్తే ఇలా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అభిమానులు సృష్టించిన గందరగోళంతో కుర్చీలన్నీ విరిగిపోయాయి. సభ ముగించుకుని పవన్‌ వెళ్తున్నప్పుడు కూడా తొక్కిసలాట జరిగింది. పవన్‌ వైపు దూసుకెళ్లేందుకు అభిమానులు యత్నించారు. దీంతో అతికష్టం మీద పవన్‌ అక్కడి నుంచి బయటపడ్డారు.

టాప్‌లెస్‌గా ఉన్న యువతి, సన్యాసి: ఫోటోపై ఆగ్రహం



బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ఓ సన్యాసి తీరు వివాదాస్పదమైంది. ఓ థెరపీలో భాగంగా ఓ మహిళ యొక్క వక్షోజాలను పట్టుకున్నందుకు వివాదాస్పదమైందని తెలుస్తోంది. చికిత్సలో భాగంగా అతను వాటిని తాకవద్దనేది ఉన్న నిబంధన ఉందని తెలుస్తోంది. అయితే, టాప్ లెస్‌గా (పైభాగంలో దుస్తులు లేని మహిళ) మహిళకు చెందిన రొమ్ము బాగాన్ని ఓ సన్యాసి పట్టుకుంటున్నట్లుగా ఉంది. దీని పైన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

మరోవైపు, పురుషుల ఛాతి పైన సందేశం రాస్తున్నాడని, ఆ సమయంలో ఆమె కూడా వచ్చిందని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆమె తనను తాను పురుషుడిగా జన్మించినట్లు చెప్పిందని చెప్పారని తెలుస్తోంది. కాగా, ఫేస్‌బుక్‌లో ఈ ఇమేజ్ పోస్ట్ చేశారు. దీని పైన చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచకప్ చరిత్రలో సౌతాఫ్రికా రికార్డ్, భారత్ వెనుకే.. ఇవీ రికార్డ్‌లు



కాన్‌బెర్రా: ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం నాడు కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో ఐర్లాండుతో జరుగుతున్న మ్యాచులో దక్షిణాఫ్రికా పలు రికార్డులు సృష్టించింది. సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది. ఈ ప్రపంచకప్‌లో నాలుగువందల పరుగుల మైలురాయిని దక్షిణాఫ్రికా రెండోసారి దాటింది. ఫిబ్రవరి 27వ తేదీన సిడ్నీలో వెస్టిండీస్ పైన ఐదు వికెట్లు కోల్పోయి 408 పరుగులు చేసింది. ప్రపంచకప్‌లో మ్యాచ్ తర్వాత మ్యాచ్‌లో.. 400 పై చిలుకు పరుగులు చేసిన తొలి జట్టు దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికాకు 400 పై చిలుకు పరుగులు చేయడం ఇది ఐదోసారి. తద్వారా భారత్‌తో సమానంగా ఉంది.

గత 44 రోజుల్లో దక్షిణాఫ్రికా 400పై చిలుకు పరుగులు చేయండ మూడోసారి. జనవరిలో జోహన్నస్ బర్గ్‌లో వెస్టిండీస్ పైన 439 పరుగులు చేసింది. అప్పుడు రెండు వికెట్లే కోల్పోయింది. ఏబీ డివిల్లీర్స్ 31 బంతుల్లో సెంచరీ చేసి రికార్డ్ సృష్టించాడు. 40 సంవత్సరాల ప్రపంచకప్ చరిత్రలో.. ఏ జట్టు కూడా ఒకే ఎడిషన్‌లో రెండుసార్లు 400కు పైగా పరుగులు చేయలేదు. ఇప్పుడు దక్షిణాఫ్రికా వారం వ్యవధిలోనే రెండుసార్లు చేసి రికార్డ్ సృష్టించింది. ఐర్లాండ్ పైన మంగళవారం దక్షిణాఫ్రికా 411/4 పరుగులు చేసింది. ఇది ప్రపంచకప్ చరిత్రలో రెండో బెస్ట్. అంతకుముందు భారత్ జట్టు బెర్ముడా పైన 413/5 చేసింది. ఇది తొలి బెస్ట్. హషీమ్ ఆమ్లా, డుప్లెసిస్ ఇద్దరు సెంచరీలు చేశారు. 159 పరుగులు చేసిన ఆమ్లాకు ఇది కెరీర్ బెస్ట్. డుప్లెసిస్ 109 పరుగులు చేశాడు. రసౌ 61 పరుగులు, మిల్లర్ 46 పరుగులు చేశారు. దీంతో చివరి పది ఓవర్లలో దక్షిణాఫ్రికా 121 పరుగులు చేసింది. మొన్న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులో సౌతాఫ్రికా చివరి పది ఓవర్లలో 150 పరుగులు చేసింది. ప్రపంచ కప్‌ల్లో టాప్ 3 అత్యధిక స్కోర్. 413/5 in 50 ఓవర్లు - భారత్ Vs బెర్ముడా - 2007లో 411/4 in 50 ఓవర్లు - దక్షిణాఫ్రికా Vs ఐర్లాండ్ - 2015లో 408/5 in 50 ఓవర్లు - దక్షిణాఫ్రికా Vs వెస్టిండీస్ - 2015లో వన్డే చరిత్రలో 400+ (14) 5సార్లు సౌతాఫ్రికా, భారత్, రెండుసార్లు శ్రీలంక, ఒకసారి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్

పెళ్లికి ప్రియుడు నిరాకరణ: ప్రేయసి ఆత్మహత్య


హైదరాబాద్: ప్రేమించిన వాడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం బండలేమూరులో సోమవారం వెలుగులోకి వచ్చింది.
ప్రేమించినందుకు గాను ప్రియుడిని పెళ్లి చేసుకోమని ప్రేయసి నిలదీసింది. పెళ్లికి ప్రియుడు నిరాకరించడంతో ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రేయసి తరుపు బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రియుడిపై మంచాల పోలీస్ స్టేషన్‌లో మృతురాలి తరపు బంధువులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి 

ప్రత్యేక హోదాపై మంత్రి సుజనా, వెంకయ్యకు అన్నీ తెలుసు: పత్తిపాటి


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించేందుకు చివరివరకూ ప్రయత్నిస్తామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో సామరస్యంగా ఉండి రాష్ట్రానికి నిధులు రాబడుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన 2015-16 బడ్జెట్ బాగుందని అన్నారు. త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని, ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టిసారిస్తుందని తన అభిప్రాయాన్ని చెప్పారు.

ఏపీకి అన్యాయం జరిగింది: పత్తిపాటి పుల్లారావు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకి తెలుసున్నారు. ఏపీకి కొన్ని ప్రత్యేక కేటాయింపులు ఇస్తేసే అభివృద్ధి చెందుతుందని చెప్పారు.


ల్యాండ్ పూలింగ్ విజయవంతం: మంత్రి నారాయణ రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ విజయవంతమైందని మంత్రి నారాయణ చెప్పారు. 33,251 ఎకరాలకు గాను తాము 33,100 ఎకరాలు సేకరించామన్నారు. మే నెలలో రాజధానికి శంకుస్థాపన ఉంటుందని తెలిపారు. కేంద్ర బడ్జెట్ బాగా నిరాశపరిచిందని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో ఈ విషయం చర్చిస్తారని చెప్పారు.

ఏపీ, టీలపై మాట నిలుపుకుంటున్న పవన్! జగన్‌కు ధీటుగా తెరపైకి


హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు! నిన్నటి వరకు తాను మద్దతు పలికిన... ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబులను ఆయన నిలదీయనున్నారు. ఏపీ సమస్యలపై స్పందించేందుకు పవన్ రావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సైడ్ చేసినట్లయిందని అంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వాలు విఫలం కావడంపై పవన్ ప్రశ్నిస్తే.. అది జగన్ 'విమర్శ అనే ఆయుధానికి' మరింత పదును అవుతుందని మరికొందరు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం పవన్ తాను మద్దతు పలికిన పార్టీలను నిలదీసేందుకు తొలిసారి ముందుకు రావడంపై పలువురు కితాబిస్తున్నారు. రైల్వే, సాధారణ బడ్జెట్‌లలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఊరట లభించలేదు. బడ్జెట్ పైన తెలంగాణకు తెరాస కొంత సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, ఏపీలో అధికారంలో తెలుగుదేశం పార్టీ మాత్రం పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చే హామీల పైన బీజేపీ నాటి అధికార కాంగ్రెస్ పార్టీతో పోటీ పడింది. ఇప్పుడు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, స్పెషల్ ప్యాకేజీ తదితర అంశాలలో పూర్తిగా అసంతృప్తికి గురి చేసింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ సహా అందరు అసంతృప్తితో ఉన్నారు. ఇదే అదనుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైన విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు, రాజధాని భూసమీకరణ పైన పలువురు రాజధాని ప్రాంత రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఫిబ్రవరి 28తో భూసమీకరణ గడువు ముగిసింది. భూసమీకరణలో ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నప్పటికీ.. చాలామంది రైతులు భయపడి ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.

'ఎంజీఆర్ కంటే ఎందులో తక్కువ, ఎన్టీఆర్ బతికుంటే ప్రధాని అయ్యేవారు'

హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు మృతి చెందకపోతే ప్రధానమంత్రి అయ్యేవారని ప్రముఖ సినీ దర్శక, నిర్మాత, నటుడు ఆర్ నారాయణ మూర్తి ఆదివారం అన్నారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎంజీఆర్ కంటే ఎన్టీఆర్ ఎందులో తక్కువ అని ప్రశ్నించారు. వారికి భారతరత్న ఇచ్చి మనవాళ్లకు ఎందుకివ్వరని ప్రశ్నించారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణకు ఎందుకు ఇవ్వలేదన్నారు. లతా మంగేష్కర్ వంటి వారు అంటే గౌరవమని, కానీ మన సుశీలమ్మకు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. ఈ వివక్ష ఎందుకని ప్రశ్నించారు.

పద్మశ్రీ, భారతరత్న సహా అన్నింటా లాబియింగ్ బాధాకరమని ఆర్ నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంజీఆర్ కాలం తమిళనాడుకే పరిమితమని, ఎన్టీఆర్ మాత్రం దేశ నాయకుడన్నారు. ఆయన ముందే చనిపోకుంటే ప్రధాని అయ్యేవారన్నారు. కాగా, స్వర్గీయ నందమూరి తారక రామారావు చనిపోకపోయి ఉంటే ఆయన ప్రధాని అయ్యేవారని తెలుగు తమ్ముళ్లు కూడా భావిస్తారు. ఇప్పుడు ఆర్ నారాయణ మూర్తి నోట అవే వ్యాఖ్యలు రావడం గమనార్హం. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ గత కొద్దికాలంగా ఉన్న విషయం తెలిసిందే.

అసంతృప్తి: బాబుతో మాట్లాడానని వెంకయ్య, ఏపీకి రూ.2లక్షల కోట్లు


హైదరాబాద్: బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్ తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం స్పందించారు. రానున్న ఐదేళ్లలో ఏపీకి రూ.2లక్షల కోట్ల నిధులు వస్తాయని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా పైన తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రైల్వే, సాధారణ బడ్జెట్ పైన ఏపీ ప్రజలు, సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సహా విపక్షాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. తెలుగు రాష్ట్రాల చిన్నపాటి సమస్యలను బడ్జెట్‌లో పెట్టలేరన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చుతామని చెప్పారు. బడ్జెట్ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడానన్నారు. సమస్యను ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకు వెళ్లాలని చెప్పానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు తక్కువ నిధులు కేటాయింపు నిజమేనని, నిధులు పెంచాలని కోరుతానన్నారు. హైకోర్టు విభజనకు కేంద్రం మద్దతిస్తుందన్నారు. వాస్తవానికి దర్పణం పట్టేలా రైల్వే బడ్జెట్‌ ఉందన్నారు. భద్రత, శుభ్రత, స్వచ్ఛతకు రైల్వే బడ్జెట్‌లో పెద్దపీట వేశామన్నారు. బడ్జెట్‌ ప్రభావం ఇప్పుడే తెలిసిరాదని, ఒకట్రెండు ఏళ్లలో తెలుస్తుందన్నారు. గతంలో బడ్జెట్‌లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఇంకా 40 ఏళ్లు పడుతుందని, మళ్లీ కొత్త హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టలేమన్నారు.

భారత్‌ వృద్ధి రేటు 8 శాతానికి పెరిగే అవకాశముందని ఆర్థిక సర్వే చెబుతోందని, అదేవిధంగా ఇతర సంస్థల సర్వేలు కూడా భారత్‌ వృద్ధి రేటు చైనాను మించిపోతుందని తెలుపుతున్నాయన్నారు. ప్రస్తుత సమావేశాల్లో ఆరు ఆర్డినెన్స్‌లపై చర్చ చేపడతామన్నారు. ఆర్ఢినెన్స్‌లు జారీచేశాక చేసిన కార్యక్రమాలన్నీ చట్టబద్దమేనన్నారు. భూసేకరణలో చట్టంలో మార్పులు తీసుకురావాలని ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సీఎంల సమావేశంలో నిర్ణయించామన్నారు. ఈ ఆర్డినెన్స్‌ కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. రైతులకిచ్చే పరిహారం తగ్గించడం లేదన్నారు. బోగ్గు కుంభకోణం కారణంగా సుప్రీం కోర్టు రద్దుచేసిన గనులను తిరిగి వేలం వేస్తామని చెప్పారు. వేలంలో పారదర్శకత పాటిస్తామన్నారు. ఆర్థిక లోటును సరిదిద్దుతున్నామని చెప్పారు. దేశం ఆర్థికంగా కోలుకునేలా చేయాలనేది తమ ప్రయత్నమన్నారు. కాగా, పోలవరంకు ఈ బడ్జెట్లో కేవలం రూ.100 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో కనీసం సగం కూడా కేటాయించలేదు. గత బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించారు. 2009 అంచనాల ప్రకారం పోలవరం నిర్మాణానికి రూ.16010 కోట్లు దీనిని నాటి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పుడు పోలవరం వ్యయం సుమారు రూ.20వేల కోట్లు అవుతాయని అంచనా. ఇప్పటి వరకు రూ.5700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. 2018 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఏడాదికి కనీసం రూ.5వేల కోట్ల చొప్పున మూడేళ్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

బడ్జెట్ ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్‌కు ఐఐఎం, ఆర్థిక సహాయ నిధి


న్యూఢిల్లీ: 2015-16 బడ్టెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోకసభలో ప్రవేశపెట్టారు. ఆయన తన బడ్టెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ఇది. కేంద్ర బడ్జెట్ రూ.17,77,477 కోట్లు ప్రణాళికేతర వ్యయం రూ.13,12,200 కోట్లు ప్రణాళికా వ్యయం 4,65,000 కోట్లు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐఐఎం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందిస్తామని, అందుకు ప్రత్యేక సహాయ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. విభజన సమయంలో తెలంగాణకు, ఎపిలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అరుణ్ జైట్లీ చెప్పారు. ఆర్థిక వెనకబడిన బెంగాల్, బీహార్ రాష్ట్రాలతో పాటు ఎపికి కూడా ప్రత్యేక ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. - డిజిటల్ ఇండియాలో తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ - ఉన్నత విద్య కోసం ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి పథకం - హైదరాబాదులో కుతుబ్ షాహీ సమాధుల రక్షణకు నిధులు - బీహార్‌లో ఎయిమ్స్ తరహాలో మరో సంస్థ - జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటు - 5 లక్షల గ్రామాలకు వైపై సౌకర్యం - 25 చారిత్రక కట్టడాల పరిరక్షణనకు ప్రత్యేక నిధులు - జమ్మూ కాశ్మీర్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎయిమ్స్ - విమానాశ్రయంలో దిగిన వెంటనే వీసాల సౌకర్యం 43 దేశాల నుంచి 150 దేశాలకు పెంపు - ఆర్థిక వ్యవహారాల పరిష్కారం కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు - మన స్టాక్ మార్కెట్లను ప్రపంచ స్థాయికి అభివృద్ధి చేయడానికి చర్యలు - పారదర్శకతతో పవర్ ప్రాజెక్టు టెండర్లు - ఒకే గొడుగు కిందికి ఎఫ్ఎంసి, సెబీ - అశోక్ చక్ర పేరుతో గోల్డ్ కాయిన్లు - నల్లధనాన్ని కట్టడి చేసేందుకు డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీల పెంపు - నగదు లావాదేవీలు లేని విధానం వైపు అడుగులు వేద్దాం - ఈపిఎఫ్‌‌లో ఉద్యోగులకు పింఛను పథకాలను ఎంచుకునే సౌకర్యం - నిర్భయ ఫండ్‌కు అదనంగా వేయి కోట్ల రూపాయల కేటాయింపు - ఐసిడిఎస్ కు రూ.1500 కోట్ల కేటాయింపు - మౌలిక సదుపాయల కోసం 70 వేల కోట్లకేటాయింపు - ఇన్నోవేషన్, పరిశోధనల కోసం 150 కోట్ల కేటాయింపు - స్టార్టప్, బిజినెస్ ఇంక్యుబేషన్ కోసం వేయికోట్ల కేటాయింపు - ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.5 వేల కోట్ల కేటాయింపు - పరిశ్రమల స్థాపనకు 14 అనుమతుల కోసం పోర్టల్ - అటల్ పింఛన్ యోజన పథకానికి ప్రభుత్వం 50 శాతం సహాయం - ఐదు ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదన - రైళ్లు, రోడ్డు, నీటిపారుదల ప్రాజెక్టులకోసం బాండ్ల జారీ - ఈపిఎఫ్‌లో ఎవరికీ చెందని 3 వేల కోట్ల రూపాయలు వృద్ధుల సంక్షేమానికి ఖర్చు - జనధన్ యోజన, బొగ్గు గనుల వేలం, స్వచ్ఛ భారత్ మా విజయాలు - గ్రామీణ వ్యవసాయానికి, మౌలిక సదుపాయాలకు 25 వేల కోట్ల కేటాయింపు - కొత్తగా రెండు బీమా పథకాలు, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, జ్యోతి బీమా యోజన - పేదలకు ఏడాదికి రూ. 12 ప్రీమియంతో రూ. 2 లక్షల  ప్రమాద బీమా - సూక్ష్మ సేధ్యం కోసం 5300 కోట్ల కేటాయింపు - మరో లక్ష కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం - సిబ్సిడీలో దుర్వినియోగాన్ని నిరోధిస్తాం - బ్యాంకుల ద్వారా రైతులకు రుణాల లక్ష్యం 8.5 లక్షల కోట్లు - నూతన పారిశ్రామికవేత్తల కోసం ముద్ర బ్యాంక్ ఏర్పాటు - పోస్టాఫీసుల ద్వారా జన్ ధన్ యోజన నష్టదాయక కంపెనీల నుంచి, ఆదాయం రాని సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరిస్తామని జైట్లీ చెప్పారు ఉద్యోగాలను సృష్టించేవారిగా యువతను తయారు చేయడమే మేక్ ఇన్ ఇండియా లక్ష్యమని చెప్పారు. కేందర్ం నుంచి రాష్ట్రాలకు 60 శాతం నిధులు సమకూర్చనున్నట్లు ఆయన చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం నిజంగా కత్తి మీద సామేనని అన్నారు. అత్యున్నత ఆదాయవర్గాలకు గ్యాస్ రాయితీ నిలిపివేస్తామని చెప్పారు. పార్లమెంటు సభ్యులు కూడా గ్యాస్ రాయితీని వదులుకోవాలని సూచించారు. స్టార్టప్‌లు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. వృద్ధి రేటును రెండంకెలకు తీసుకుని వెళ్తామని జైట్లీ చెప్పారు. 2016 ఏప్రిల్ 1వ తేదీ నాటికి జిఎస్‌టిని అమలులోకి తెస్తామని అన్నారు. 2020నాటికి విద్యుదీకరణను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయం, సాగునీరి, అగ్రి ప్రాసెసింగ్‌లను ఒక గొడుగు కిందికి తెస్తామని చెప్పారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పథకాలను రూపొందిస్తామని అన్నారు. 2022నాటికి పట్టణ ప్రాంతాల్లో 2 కోట్లు, గ్రామాల్లో 4 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో పాఠశాల, ప్రతి 10 కిలోమీటర్ల పరిధిలో కళాశాల ఉండేలా చూస్తామని అన్నారు. ద్రవ్యోల్బణం నియంత్రణలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని జైట్లీ చెప్పారు. 2015 -16లో ఆర్థిక వృద్ధి రేటు 8 శాతం నుంచి 5.5 శాతానికి పెరుగుతుందని అంచనా వేసినట్లు జైట్లీ చెప్పారు. మిగతా కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలపడిందని అన్నారు. అభివృద్ధిలో రాష్ట్రాలు కీలకమని, రాష్ట్రాలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామని జైట్లీ చెప్పారు. ద్రవ్యోల్బనం 5.1 శాతం తగ్గినట్లు తెలిపారు. ప్రపంచం ప్రస్తుతం భారత్ వైపు చూస్తోందని అన్నారు. పెట్టుబడులకు భారత్ అనువైన ప్రదేశమని చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందని ప్రపంచం గుర్తించిందని అన్నారు. లిజేశీ మారకం నిల్వలు 320 బిలియన్లకు చేరినట్లు తెలిపారు 50 లక్షల మరుగుదొడ్డ నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. ఇంకా 6 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నామని జైట్లసీ అన్నారు. ఆర్థిక వృద్ధిలో రాష్ట్రాలకు సమభాగస్వామ్యం కలిగి ఉండాలని తాము కోరుకుంటున్నామని అరుణ్ జైట్లీ అన్నారు. గత 9 నెలల్లో ఆర్థిక వ్యవస్థను పట్టాల మీదికి ఎక్కించడానికి ఎన్డిఎ ప్రభుత్వం ప్రయత్నించిందని అన్నారు. ఆర్థిక వృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. 2015 - 16 బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బడ్జెట్ ప్రతులు పార్లమెంటుకు చేరుకున్నాయి. అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను శనివారం ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఆయన ఉదయం తొమ్మిది గంటలకో నార్త్ బ్లాక్ చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కేంద్ర బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని జైట్లీ ఇదివరకే చెప్పారు. రాష్ట్రాల పట్ల బడ్జెట్‌లో ఉదారంగా ప్రవర్తించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని రాష్ట్ర పార్లమెంటు సభ్యులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి పన్ను రాయితీలు ఇవ్వాలని ఆ రాష్ట్ర పార్లమెంటు సభ్యులు కోరారు. అరుణ్ జైట్లీ బడ్జెట్ పెద్దగా పథకాలను ప్రకటించకపోవచ్చునని అంటున్నారు. పెట్టుబడులను పెద్ద యెత్తున ఆకర్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగానే జైట్లీ బడ్జెట్ ఉండవచ్చునని భావిస్తున్నారు. మధ్యతరగతి, ఉద్యోగులను సంతృప్తి పరిచే అవకాశం ఉందని అంటున్నారు. రాజకీయంగా ఒత్తిడి లేకపోవడంతో కచ్చితమైన నిర్ణయాలను ప్రకటించవచ్చునని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన ఆర్థిక సాయం అందిస్తారనేది ఉత్కంఠను కలిగించే విషయం. బడ్జెట్‌లో పన్ను రాయితీలు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.

లైవ్: బడ్జెట్, నార్త్ బ్లాక్ చేరుకున్న అరుణ్ జైట్లీ, ఎపి ఆశలు


న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను శనివారం ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఆయన ఉదయం తొమ్మిది గంటలకో నార్త్ బ్లాక్ చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కేంద్ర బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని జైట్లీ ఇదివరకే చెప్పారు. రాష్ట్రాల పట్ల బడ్జెట్‌లో ఉదారంగా ప్రవర్తించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని రాష్ట్ర పార్లమెంటు సభ్యులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి పన్ను రాయితీలు ఇవ్వాలని ఆ రాష్ట్ర పార్లమెంటు సభ్యులు కోరారు. అరుణ్ జైట్లీ బడ్జెట్ పెద్దగా పథకాలను ప్రకటించకపోవచ్చునని అంటున్నారు. పెట్టుబడులను పెద్ద యెత్తున ఆకర్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగానే జైట్లీ బడ్జెట్ ఉండవచ్చునని భావిస్తున్నారు. మధ్యతరగతి, ఉద్యోగులను సంతృప్తి పరిచే అవకాశం ఉందని అంటున్నారు. రాజకీయంగా ఒత్తిడి లేకపోవడంతో కచ్చితమైన నిర్ణయాలను ప్రకటించవచ్చునని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన ఆర్థిక సాయం అందిస్తారనేది ఉత్కంఠను కలిగించే విషయం. బడ్జెట్‌లో పన్ను రాయితీలు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ సూచన: అయినా ఎపికి ప్రత్యేక హోదా హుళక్కే?


న్యూఢిల్లీ: సమయం చూసి పవన్ కళ్యాణ్ తన మాటను బయటపెట్టినప్పటికీ ప్రధాని మోడీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈసారి ప్రత్యేక హోదా కల్పించడానికి సిద్ధంగా లేనట్లు ప్రచారం సాగుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఆందోళనలకు దిగినా ఫలితం ఉండేట్లు కనిపించడం లేదు. బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై ఏ విధమైన ప్రకటన ఉండబోదని అంటున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన సమయం వచ్చిందని పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపిలకు సూచించారు. ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై బిజెపి మాటల నిలబెట్టుకునే సమయం వచ్చిందని ఆయన అన్నారు. నిరుడు రాష్ట్ర విభజన బిల్లుకు అస్తవ్యస్తమైన రీతిలో కాంగ్రెసు పార్లమెంటులో ఆమోదం పొందిందని, విభజనకు బిజెపి కూడా మద్దతు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. విభజన తర్వాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ప్రత్యేక హోదా మంజూరు చేస్తామని బిజెపి కూడా హామీ ఇచ్చిందని ఆయన అన్నారు. ఆ మాట మీద నిలబడాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. అయితే, అది సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు.



ఇష్టం లేకుంటే తొలగిస్తాం: తగ్గిన మోడీ, కాంగ్రెస్ గెలిచేది కదా అని చురక

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన ధోరణికి భిన్నంగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది! శుక్రవారం ఆయన లోకసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా భూసేకరణ బిల్లులో రైతులకు ఇష్టం లేనివి ఏమైనా ఉంటే తొలగిస్తామని, సవరణలకు సిద్ధమని చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పైన పరోక్షంగా నిప్పులు చెరగడంతో పాటు ఆ పార్టీకి చురకలు అంటించారు. ప్రస్తుత దేశ పరిస్థితికి గత పాలకులే కారణమన్నారు. ప్రధాని మోడీ లోకసభలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఎంపీలు సానుకూల ధోరణి అలవర్చుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికే తాము ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ పైన దృష్టి పెట్టాలన్నారు. రాజకీయాలు పక్షపాతాలకు అతీతంగా ఉండాలన్నారు. పాత పథకాలను మారుస్తున్నారన్న విమర్శ వస్తోందని, పేరు ఏదైనా సమస్యలు పరిష్కారమే తమ లక్ష్యమని చెప్పారు. యూపీఏ బిల్లులోని లోపాలను తాము సవరిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన భూసేకరణ పైన కాంగ్రెస్ బిల్లు నచ్చితే పార్టీ గెలిచేది కదా అని చురకలు అంటించారు. భూసేకరణ చట్టం రైతులకు వ్యతిరేకం కాదన్నారు. పేదలకు లబ్ధి చేకూరాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. భూసేకరణ చట్టంలో మార్పులకు సిద్ధమన్నారు. చట్టంలో రైతులకు ఆమోదయోగ్యం కాని అంశాలు తొలగిస్తామని చెప్పారు. 


ఇస్లామిక్ స్టేట్: స్త్రీలు సహా.. ఎత్తుకెళ్తున్నారు, పారిపోతున్న క్రిష్టియన్లు

బీరుట్: ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐసిస్) తీవ్రవాదులు సిరియాలో రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. ఇటీవలి కొద్ది రోజుల సమయంలో 220 మంది క్రిస్టియన్లను వారు అఫహరించారు. నిత్యం క్రిస్టియన్లను అపహరిస్తున్న నేపథ్యంలో సిరియాలో వేలాదిమంది క్రిస్టియన్లు తమ ఇళ్లు, గ్రామాలు వదిలి పారిపోతున్నారు. గత మూడు రోజులుగా 11 గ్రామాలలోని 220 అస్సిరియన్ సిటిజన్లను అఫహరించారని సిరియా ఆబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ తెలిపింది. వారిని హాసాకే ప్రావిన్స్ నుండి ఎత్తుకెళ్లారు. వారి విడుదల కోసం పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు అపహరించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు, వృద్ధులే కావడం గమనార్హం. 220 మంది క్రిస్టియన్ల అపహరణ పైన అమెరికా తీవ్రంగా స్పందించింది. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. 21ని ఐస్‌గా భావించిన పోలీసులు... ఓ జంట తమ కుటుంబంలోని ఒకరి ఇరవయ్యొక్కటవ పుట్టిన రోజు కోసం 21 అంకెను వేసింది. అపార్టుమెంటులో పుట్టిన రోజు సందర్భంగా 21 అనే సంఖ్యను వేశారు. అయితే, ఇది రివర్స్‌లో బయట నుండి 'ఐఎస్'గా కనిపించింది. దీంతో స్వీడన్ పోలీసులు పొరపాటున అది ఐఎస్‌గా భావించారు. దీనిని ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారులు పెట్టి ఉంటారని భావించారు. అనంతరం అసలు విషయం తెలిసిందే.


మోడీకి నేనంటే గిట్టదు: అన్నాహజారే, మీకే చెప్తాం: రాహుల్ పోస్ట్‌పై సోనియా


న్యూఢిల్లీ: అన్నాహజారే గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి నేను అంటేనే ఇష్టముండదని, అందుకే తన సూచనలు, సలహాలు తీసుకునేందుకు ఇష్టపడడని వ్యాఖ్యానించారు. ల్యాండ్ బిల్లును అన్నా హజారే వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లోకసభ ఎన్నికల సమయంలో తాను ప్రధాని నరేంద్ర మోడీని, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలకు వ్యతిరేకంగా మాట్లాడానని, వారు పారిశ్రామికవేత్తలకు అనుకూలమని అప్పుడు విమర్శించానని, అందుకే వారికి తానంటే గిట్టదని, అందుకే మోడీ తన సూచనలు తీసుకోరని హజారే అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉందని ఆరోపించారు. రైతుల భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తోందన్నారు. ల్యాండ్ బిల్లులో కొన్ని సవరణలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బిల్లు పైన త్వరలో ఓ టీంను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాహుల్ గాంధీకి పగ్గాలిస్తే తెలిసేది మీకే: సోనియా రాహుల్ గాంధీ ఏప్రిల్ నెలలో ఏఐసీసీ పగ్గాలు కట్టబెడతారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీని పైన సోనియా గాంధీ స్పందించారు. రాహుల్‌ పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు ఆ విషయం మీకు తెలియజేస్తామని మీడియాతో అన్నారు. మరోవైపు, సోనియా, రాహుల్‌ మధ్య విభేదాలు తలెత్తినట్లు వచ్చిన వార్తలను కాంగ్రెస్‌ పార్టీ తోసిపుచ్చింది. సోనియా, రాహుల్‌ సమన్వయంతో పార్టీని నడిపించడం తమకెంతో ఆనందంగా ఉందని పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ గౌడ అన్నారు. 

రైల్వేబడ్జెట్: టీడీపీ అసహనం, తెలుగు రాష్ట్రాలకు ఇంతే..! ఎవరేమన్నారు..\


హైదరాబాద్: కేంద్రమంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ పైన విమర్శలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తవి అనకుండా దూరదృష్టితో మంచి బడ్జెట్ ప్రవేశ పెట్టారని కొందరు పొగడుతుండగా, కొత్త ప్రాజెక్టులు, రైళ్లు లేవని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్‌లో దూరదృష్టి, భద్రత, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. కొత్త వాటి కంటే పాత ప్రాజెక్టులను పూర్తి చేయడం, ప్రయాణీకులను సంతుష్టులను చేయడానికే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత కల్పించారు. మహిళల భద్రత పైన ఈ బడ్జెట్‌లో ప్రత్యేక దృష్టి సారించారు. వైఫై సౌకర్యాలు, కొత్త హెల్ప్ లైన్లు, స్పీడ్ రైళ్లు రానున్నాయి. ప్రయాణీకుల ఛార్జీలు పెంచనప్పటికీ, సరకు రవాణా ఛార్జీలు పెరిగే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీ, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, కాంగ్రెస్ నేత శశిథరూర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాంగ్రెస్ నేతలు, వైయస్సార్ కాంగ్రెస్ నేతలు రైల్వే బడ్జెట్ పైన పెదవి విరిచారు. బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, శివసేనలు కూడా పెదవి విరిచాయి. ఏపీకి కేటాయింపులు లేవని టీడీపీ, బడ్జెట్లో స్పష్టత లేదని, అమలుకు నిధులు ఎలా వస్తాయో అర్థం కావడం లేదని శివసేన చెబుతోంది. రైల్వే బడ్జెట్ నిరాశ పరిచిందని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. విభజన హామీలు కూడా నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలకు... కాజీపేట - విజయవాడ మధ్య మూడో రైల్వే లైనుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రూట్ చాలా రద్దీగా ఉంటుంది. దీంతో లెవల్ క్రాసింగుల వద్ద రైళ్లను ఆపుతుండటంతో ప్రయాణం ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు పదేళ్ల క్రితమే మూడో లైన్ ప్రకటించారు. సర్వే పూర్తయింది. ఈ లైనుకు రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చు కావొచ్చని అంచనా. గతంలో కొన్ని నిధులు విడుదల చేశారు. ఇప్పుడు సురేష్ ప్రభు ప్రకటనతో మరిన్ని నిధులు విడుదలయ్యే అవకాశముంది. దీంతో ఇది త్వరితగతిన పూర్తవుతుందని ఆశిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేకు రూ.2,768 కోట్లు దక్షిణ మధ్య రైల్వేలో మౌలిక సదుపాయుల కల్పనకు రూ.2,768 కోట్లు 



కేటాయించారు. గత ఏడాది కంటే ఇది దాదాపు పావు శాతం ఎక్కువ. దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన వివరాలను జీఎం శ్రీవాత్సవ మీడియా ముందు వెల్లడించారు. 36 కొత్త రైల్వే బ్రిడ్జిలు, వీటి కోసం రూ.1,587 కోట్లు, ప్యాసింజర్ సదుపాయాల కోసం రూ.29 కోట్లు, ట్రాఫిక్ వసతుల కోసం రూ.68 కోట్లు, ఆర్వోబీ, ఆర్‌యూబీలకు రూ.1587 కోట్లు, మనోహరాబాద్ - కొత్తపల్లి లైనుకు రూ.20 కోట్లు, పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ లైనుకు రూ.141 కోట్లు, మేళ్ల చెరువు-విష్ణుపురం లైన్‌కు రూ.100 కోట్లు, నంద్యాల-ఎర్రగుంట్ల లైనుకు రూ.130 కోట్లు, నడికుడి-శ్రీకాళహస్తి లైనుకు రూ.110 కోట్లు, విజయవాడ-భీమవరం-నిడదవోలు లైన్ డబ్లింగ్ విద్యుధీకరణకు రూ.150 కోట్లు, సికింద్రాబాద్-మహబూబ్ నగర్ లైన్ డబ్లింగ్ పనులకు రూ.1,200 కోట్లు కేటాయించారు. దువ్వాడ-విజయవాడ లైన్‌కు రూ.3.34 కోట్లు, బాపట్ల - నిజాంపట్నం-రేపల్లె లైన్‌కు రూ.15 లక్షలు, గిద్దలూరు-బాకరాపేట లైన్‌కు రూ.19 లక్షలు, మంత్రాలయం రోడ్డు - కర్నూలు టౌన్ లైన్‌కు రూ.13 లక్షలు, గుత్తి - ధర్మవరం లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ రూ.26 లక్షలు, గుంతకల్లు - గుంటూరు డబ్లింగ్ పనులకు రూ.80 లక్షలు, బీడీఆర్సీ-విశాఖ లైన్‌కు రూ.41 కోట్లు, జగ్గయ్యపేట-మిరియాలగూడ లైన్‌కు దాదాపు రూ.పది లక్షలు, నంద్యాల - ఆత్మకూరు లైన్‌కు రూ.నాలుగున్నర లక్షలు, హైదరాబాద్-శ్రీశైలం లైన్‌కు రూ.పాతిక లక్షలు, మహబూబ్ నగర్ - గుత్తి లైన్‌కు రూ.63న్నర లక్షలు, ధర్మవరం- పాకాల లైన్‌కు రూ.60 లక్షలకు పైగా. తిరుపతి-కాట్పడి లైన్ సర్వే కోసం రూ.14 లక్షలకు పైగా. ఎవరేమన్నారు? రైల్వే బడ్జెట్‌ మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా ఉంది. బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడం ఇదే తొలిసారి. గతంలో తమ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులపై స్పష్టత ఇవ్వలేదు. - కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి దేశ చరిత్రలో ఇలాంటి బడ్జెట్‌ను ఇది. ప్రజలను బీజేపీ మోస్తం చేస్తోందనడానికి ఈ బడ్జెటే నిదర్శనం. - బొత్స సత్యనారాయణ బడ్జెట్ అసంతృప్తిగా ఉంది. విభజన సమయంలో ఇచ్చిన హామీలు లేవు. కేఈ కృష్ణమూర్తి. బడ్జెట్‌లో ఏపీకి ఎలాంటి కేటాయింపులు లేవు - మైసూరా రెడ్డి సామాన్యుడి బడ్జెట్ - బండారు దత్తాత్రేయ తెలంగాణకు అన్యాయం జరిగింది. కేసీఆర్ రైల్వే ప్రాజెక్టులు తేవడంలో విఫలం - పొన్నం ప్రభాకర్ తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్‌లో అన్యాయం - సీపీఐ నారాయణ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించారు. రెండు దశాబ్దాలలో ఇది ఉత్తమ బడ్జెట్ - లోక్‌సత్తా జేపీ
కాంగ్రెస్ పార్టీ, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, కాంగ్రెస్ నేత శశిథరూర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాంగ్రెస్ నేతలు, వైయస్సార్ కాంగ్రెస్ నేతలు రైల్వే బడ్జెట్ పైన పెదవి విరిచారు. బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, శివసేనలు కూడా పెదవి విరిచాయి. ఏపీకి కేటాయింపులు లేవని టీడీపీ, బడ్జెట్లో స్పష్టత లేదని, అమలుకు నిధులు ఎలా వస్తాయో అర్థం కావడం లేదని శివసేన చెబుతోంది. రైల్వే బడ్జెట్ నిరాశ పరిచిందని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. విభజన హామీలు కూడా నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలకు... కాజీపేట - విజయవాడ మధ్య మూడో రైల్వే లైనుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రూట్ చాలా రద్దీగా ఉంటుంది. దీంతో లెవల్ క్రాసింగుల వద్ద రైళ్లను ఆపుతుండటంతో ప్రయాణం ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు పదేళ్ల క్రితమే మూడో లైన్ ప్రకటించారు. సర్వే పూర్తయింది. ఈ లైనుకు రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చు కావొచ్చని అంచనా. గతంలో కొన్ని నిధులు విడుదల చేశారు. ఇప్పుడు సురేష్ ప్రభు ప్రకటనతో మరిన్ని నిధులు విడుదలయ్యే అవకాశముంది. దీంతో ఇది త్వరితగతిన పూర్తవుతుందని ఆశిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేకు రూ.2,768 కోట్లు దక్షిణ మధ్య రైల్వేలో మౌలిక సదుపాయుల కల్పనకు రూ.2,768 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే ఇది దాదాపు పావు శాతం ఎక్కువ. దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన వివరాలను జీఎం శ్రీవాత్సవ మీడియా ముందు వెల్లడించారు. 36 కొత్త రైల్వే బ్రిడ్జిలు, వీటి కోసం రూ.1,587 కోట్లు, ప్యాసింజర్ సదుపాయాల కోసం రూ.29 కోట్లు, ట్రాఫిక్ వసతుల కోసం రూ.68 కోట్లు, ఆర్వోబీ, ఆర్‌యూబీలకు రూ.1587 కోట్లు, మనోహరాబాద్ - కొత్తపల్లి లైనుకు రూ.20 కోట్లు, పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ లైనుకు రూ.141 కోట్లు, మేళ్ల చెరువు-విష్ణుపురం లైన్‌కు రూ.100 కోట్లు, నంద్యాల-ఎర్రగుంట్ల లైనుకు రూ.130 కోట్లు, నడికుడి-శ్రీకాళహస్తి లైనుకు రూ.110 కోట్లు, విజయవాడ-భీమవరం-నిడదవోలు లైన్ డబ్లింగ్ విద్యుధీకరణకు రూ.150 కోట్లు, సికింద్రాబాద్-మహబూబ్ నగర్ లైన్ డబ్లింగ్ పనులకు రూ.1,200 కోట్లు కేటాయించారు. దువ్వాడ-విజయవాడ లైన్‌కు రూ.3.34 కోట్లు, బాపట్ల - నిజాంపట్నం-రేపల్లె లైన్‌కు రూ.15 లక్షలు, గిద్దలూరు-బాకరాపేట లైన్‌కు రూ.19 లక్షలు, మంత్రాలయం రోడ్డు - కర్నూలు టౌన్ లైన్‌కు రూ.13 లక్షలు, గుత్తి - ధర్మవరం లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ రూ.26 లక్షలు, గుంతకల్లు - గుంటూరు డబ్లింగ్ పనులకు రూ.80 లక్షలు, బీడీఆర్సీ-విశాఖ లైన్‌కు రూ.41 కోట్లు, జగ్గయ్యపేట-మిరియాలగూడ లైన్‌కు దాదాపు రూ.పది లక్షలు, నంద్యాల - ఆత్మకూరు లైన్‌కు రూ.నాలుగున్నర లక్షలు, హైదరాబాద్-శ్రీశైలం లైన్‌కు రూ.పాతిక లక్షలు, మహబూబ్ నగర్ - గుత్తి లైన్‌కు రూ.63న్నర లక్షలు, ధర్మవరం- పాకాల లైన్‌కు రూ.60 లక్షలకు పైగా. తిరుపతి-కాట్పడి లైన్ సర్వే కోసం రూ.14 లక్షలకు పైగా. ఎవరేమన్నారు? రైల్వే బడ్జెట్‌ మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా ఉంది. బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడం ఇదే తొలిసారి. గతంలో తమ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులపై స్పష్టత ఇవ్వలేదు. - కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి దేశ చరిత్రలో ఇలాంటి బడ్జెట్‌ను ఇది. ప్రజలను బీజేపీ మోస్తం చేస్తోందనడానికి ఈ బడ్జెటే నిదర్శనం. - బొత్స సత్యనారాయణ బడ్జెట్ అసంతృప్తిగా ఉంది. విభజన సమయంలో ఇచ్చిన హామీలు లేవు. కేఈ కృష్ణమూర్తి. బడ్జెట్‌లో ఏపీకి ఎలాంటి కేటాయింపులు లేవు - మైసూరా రెడ్డి సామాన్యుడి బడ్జెట్ - బండారు దత్తాత్రేయ తెలంగాణకు అన్యాయం జరిగింది. కేసీఆర్ రైల్వే ప్రాజెక్టులు తేవడంలో విఫలం - పొన్నం ప్రభాకర్ తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్‌లో అన్యాయం - సీపీఐ నారాయణ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించారు. రెండు దశాబ్దాలలో ఇది ఉత్తమ బడ్జెట్ - లోక్‌సత్తా జేపీ

లైవ్: ఎటూ వెళ్లని రైలు!: ఛార్జీలు పెంచలేదు, భద్రతకి పీట, కొత్త రైళ్లు నో


న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ రైల్వే బడ్జెట్ పైన ఎన్నో ఆశలు ఉన్నాయి. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక ఇది తొలి రైల్వే బడ్జెట్. రైల్వేలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని సురేష్ ప్రభు అన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్లు తెలిపారు. రైల్వే అభివృద్ధిపై మోడీ దృఢ నిశ్చయంతో ఉన్నారని అన్నారు. అంచనాల భారం రైల్వేలపై ఎక్కువగా ఉందని అన్నారు. రైల్వేలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని ఆయన అన్నారు. ఆధునిక భారతంలో రైల్వేల అభివృద్ధే కీలకమని మంత్రి అన్నారు. రైల్వేల మీద ఇటీవల ఒత్తిడి విపరీతంగా పెరిగిందని అన్నారు. రైల్వేలు భారతీయ జీవన విధానానికి ప్రతిీక అని గాంధీ అన్న విషయాన్ని గుర్తు చేశారు. రైల్వే మంత్రి ఈ బడ్జెట్‌లో ఒక్క కొత్త రైలు ప్రవేశ పెట్టలేదు. రైల్వే బడ్జెట్ పైన విపక్షాలు విమర్శలు గుప్పించాయి.

రైల్వే బడ్జెట్ అన్ని వర్గాలను సంతృప్తిపరిచేలా ఉందని సురష్ ప్రభు అన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైలు కోసమేనన్న సూత్రం ఆధారంగా రైల్వే బడ్జెట్ తయారు చేశామన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రయత్నం  చేశామని చెప్పారు. అన్ని వర్గాలను, ప్రాంతాలను సంతృప్తి పరిచేలా బడ్జెట్ ఉందన్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా కొత్త రైళ్లపై ప్రకటన చేస్తామన్నారు. బడ్జెట్‌లో కొత్తగా ఏదీ కనిపించలేదని మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ అన్నారు. సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట ముందు చూపుతో, భవిష్యత్తు అవసరాలను తీర్చేలా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. భారతీయ రైల్వేలు కలకాలం ఉండాలంటే పెట్టుబడులు అవసరం రైళ్లలో పెట్టుబడులు పెడితే పర్యావరణాన్ని కాపాడినట్లే గూడ్స్ బోగీలు అద్దెకు ఇచ్చే సౌకర్యం 9 కారిడార్లలో రైళ్ల స్పీడ్ పెంపు మెట్రో నగరాల మధ్య వేగవంతమైన రైళ్లు రైల్వేల భూముల కబ్జా నివారణకు డిజిటల్ మ్యాపింగ్ కోచ్ లలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూస్తాం సిగ్నలింగ్ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాం యంత్రాల సాయంతో ట్రాక్ మెయింటెనెన్స్ రాష్ట్రాల భాగస్వామ్యంతో కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం రైల్వేలలో అవినీతి సహించం ఓడరేవులతో కనెక్టివిటికీ రూ.2వేల కోట్లు రైళ్ల వేగం తగినంత పెరిగితే అబివృద్ధి సాధ్యం గతేడాది కంటే 84 శాతం పెట్టుబడులు పెంపు మరిన్ని ఆటోమేటిక్ మిషన్లు రైల్వేల ఉత్పాదక రంగాలకు ప్రయివేటు పెట్టుబడులు స్పీడ్ రైళ్లపై నివేదిక రాగానే పలు పనులు మొదలు రైల్వే భద్రతకు 6,581 కోట్లు ప్రమాదాల నివారణకు ఇస్రో సాయంతో ప్రత్యేక డిజైన్ త్వరలో 970 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం విదేశీ రైల్వే టెక్నాలజీ తీసుకు వస్తాం ఢిల్లీ - కోల్ కతా, ఢిల్లీ - ముంబై మధ్య ఓవర్ నైట్ రైల్వేలు రానున్న అయిదేళ్లలో భారతీయ రైల్వేలో గణనీయ మార్పులు గేజ్ మార్పిడీలకు ర.96వేల కోట్లు కేటాయింపు ప్రయివేటు పెట్టుబడుల కోసం నిబంధనలు సరళతరం రైల్వేలో మేకిన్ ఇండియాకు ప్రాధాన్యత మేకిన్ ఇండియాలో ఉద్యోగ కల్పన స్టీల్, బొగ్గు రవాణాకు కొత్త లైన్ల నిర్మాణం. ఈశాన్య రాష్ట్రాలకు మరింత కనెక్టివిటీ కనెక్టివిటీ రైల్వేలో పీపీపీ విధానం రైల్వేలైన్ల విద్యుధీకరణకు 130 శాతం నిధుల పెంపు 67 శాతం నిధులు ప్రయాణీకుల కోసమే ఖర్చు రైల్వేల అభివృద్ధికి ఓపెన్ బిడ్స్ ఆహ్వానిస్తాం రైల్ ఓవర్ బ్రిడ్జీ నిర్మాణానికి 60 రోజుల్లో అనుమతి 400 స్టేషన్లలో వైఫై రైళ్లలో శాకాహారులకు ప్రత్యేక వంటలు అవకాశాన్ని బట్టి డబుల్ రైల్ ట్రాక్ ల నిర్మాణం 4 రైల్వే రీసెర్చ్ కేంద్రాలు మేఘాలయను రైల్వే ట్రాక్ తో అనుసంధానం చేస్తాం రద్దీ రూట్లలో జనరల్ బోగీలు పెంపు. ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ 61 మార్గాల్లో రైల్ కమ్ రోడ్డు టిక్కెట్లు రానున్న ఐదేళ్లలో రైల్వేలోకి రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులు బ్యాంకు నిల్వలు, పెన్షన్ ఫండ్‌ను అభివృద్ధికి ఉపయోగించుకుంటాం వనరుల సమీకరణకు సంస్థలతో చర్చలు ఇంధన పొదుపుకు రైల్వల విద్యుదీకరణ ముంబై -అహ్మదాబాద్ స్పీడ్ రైలు పై నివేదిక క్రాసింగుల వద్ద ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు మనుషులు లేని క్రాసింగ్ వద్ద ఆధునిక యంత్రాలు అంధులకు సౌకర్యవంతంగా ఉండేలా బోగీలు కూరగాయలు, పచ్చి సరుకు, పండ్ల కోసం ప్రత్యేక ఏర్పాటు రైళ్లలో అగ్ని ప్రమాదాల నివారణకు కొత్త టెక్నాలజీ రైల్వే బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పతనం దిశగ సాగుతున్నాయి. జనరల్ బోగీల్లోను సెల్ ఫోన్ చార్జింగ్ సదుపాయం మహిళలకు, వృద్ధులకు లోయర్ బెర్తులు. ప్రయాణీకుల సౌకర్యాలకు ఎంపీల నిధులు ఉపయోగించవచ్చు. ముఖ్య నగరాల్లో శాటిలైట్ స్టేషన్ల ఏర్పాటు పాసింజర్ రైళ్ల రాకపోకల్లో కచ్చితమైన సమయం పాటిస్తాం 9400 కిలోమీటర్లలో గేజ్ మార్పిడి పనులు వనరుల సమీకరణపై సంస్థలతో చర్చలు జమ్మూ కాశ్మీర్ వరకు స్పీడ్ రైల్వే లైన్ల ఏర్పాటు 650 స్టేషన్లలో కొత్తగా టాయిలెట్ల నిర్మాణం టిక్కెట్లు కొనే కేంద్రాల వద్ద క్యూల నివారణకు చర్యలు పేపర్ లెస్ టిక్కెట్‌ను విస్తృతం చేస్తాం కేటగిరీ ఏ స్టేషన్లలో ఫ్రీగా వైఫై శతాబ్ధి వంటి వాటిలో మరిన్ని ఎంటర్‌టైన్మెంట్ కార్యక్రమాలు వృద్ధులకు, పేషెంట్లకు మరిన్ని సౌకర్యాలు ప్రయాణీకుల కోసం మార్చి 1 నుండి కొత్తగా 138 హెల్ప్ లైన్లు 108 రైళ్లలో ఈ కేటరింగ్ సదుపాయం ఎంపీ ఫండ్స్ తో రైల్వేల అభివృద్ధి 120 రోజుల ముందుగానే టిక్కెట్లు రిజర్వేషన్లు ప్రయాణీకుల సౌకర్యం కోసం అందరి సాయం తీసుకుంటాం 152 రైల్వే స్టేషన్లకు మోడ్రన్ రైల్వే స్టేషన్లుగా అప్ గ్రేడ్ అప్పర్ బెర్త్ లు మరింత సౌకర్యవంతంగా చేస్తాం రైళ్ల రాకపోకలు, ఆగే సమాచారాన్ని ఎస్సెమ్మెస్ ద్వారా అందిస్తాం అన్ని స్టేషన్లలో టిక్కెట్లు అమ్మే కేంద్రాల ఏర్పాటు భద్రతపై ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నెంబర్ 182 డిమాండుకు అనుగుణంగా కోచ్ లు పెంచుతాం మేజర్ స్టేషన్లలో లిఫ్టులు స్వచ్ఛ భారత్ - స్వచ్ఛ రైలు నినాదంతో ముందుకు పోతాం రైల్వే స్టేషన్లలో వాటర్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు కేటగిరీ బీ స్టేషన్లలో వైఫై సౌకర్యం ప్రయణీకులకు అతి తక్కువ ధరకు తాగునీరు కొన్ని రూట్లలో బుల్లెట్ రైళ్లు ప్రవేశ పెట్టే యోచన ఫిర్యాదుల నమోదుకు మొబైల్ నెంబర్. నిర్భయ ఫండ్ కింద మహిళలకు భద్రత కొన్ని రైళ్ల కంపార్టుమెంట్లలో సీసీ కెమెరాలు మహిళల భద్రత కోసం సీసీ కెమెరాలు, కోచ్ లు ఏర్పాటు రైళ్లలో వ్యాక్యూమ్ టాయిలెట్లు ప్రవేశపెడుతున్నాం ప్రయాణీకుల సౌకర్యానికి పెద్దపీట మిడిల్ బెర్త్ లు మహిళలు, వృద్ధులకు రాకుండా చూస్తాం స్వచ్ఛ రైల్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు మెరుగైన సౌకర్యాలు అందిస్తాం 17వేల టాయిలెట్స్ ను బయో టాయిలెట్స్ గా మారుస్తాం రైల్వేలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. సుపరిపాలన, పారదర్శకతకుపెద్దపీట, రైల్వేల ఆధునికీకరణ ఛార్జీలు పెంచే ఆలోచనలేదు. యథాతథంగా కొనసాగుతాయి రైల్వేల అభివృద్ధికి నాలుగు లక్ష్యాలు.. కనెక్టివిటీ పెంచడం, భద్రత, ఆర్థిక స్థిరత్వం, భారతీయ రైల్వే పరిస్థితిని మార్చేలా ఈ బడ్జెట్ ఉంటుంది శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు వేగం125 కిలోమీటర్లకు మించి వేగం పెంచలేమా పాసింజర్ రైళ్ల వేగం గంటకు 25 కిలోమీటర్లకు మించి పెంచలేమా పర్యావరణ హితమైన రైల్వే అభివృద్ధి లక్ష్యం రైళ్లలో భద్రత, మౌలిక వ్యవస్థలకు ప్రాధన్యత. ఇంత పెద్ద వ్యవస్థ, ఉద్యోగులతో సాధ్యం కనిది ఏముంటుంది. కాలం చెల్లిన రైళ్లను నడపాల్సిన పరిస్థితి ఉంది. ఆర్థికంగా వృద్ధి చెందాల్సి ఉంది. రాజధాని, శతాబ్ది రైళ్లు అనుకున్నంత నడవడంలేదు. సురేష్ ప్రభు బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. పార్లమెంటుకు చేరుకున్న రైల్వేమంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ బాగుంటుందని సురేష్ ప్రభు చెప్పారు. తద్వారా ఈసారీ ఛార్జీల పెంపు ఉండదని సంకేతాలి ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఉదయం పదకొండున్నర గంటలకు రైల్ భవన్ నుండి పార్లమెంటుకు బయలుదేరారు. మధ్యాహ్నం 12 గంటలకు రైల్వే బడ్జెట్ ప్రవేశ పెడతారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, రాజీవ్ ప్రతాప్ రూఢీ తదితరులు పాల్గొన్నారు.

రైల్వే బడ్జెట్: అంకెల్లో ఇండియన్ రైల్వే.., తెలుగు రాష్ట్రాల కోటి ఆశలు


న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గురువారం నాడు రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేకు సంబంధించి అంకెల్లో కొన్ని విషయాలు... 23 మిలియన్లు.. ప్రతి రోజు రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులు. ఇందుకోసం రైల్వే శాఖ 12,617 రైళ్లను నడుపుతోంది. భారత దేశంలో 7,172 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. రూ.1.4 లక్షల కోట్లు.. రైల్వేకు ప్రతి ఏటా వచ్చే రెవెన్యూ. 359 రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.1.82 లక్షల కోట్లు అవసరం అవుతాయి. గత మూడు దశాబ్దాలుగా 676 ప్రాజెక్టులు సాక్షన్ అయ్యాయి. అందులో 317 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ప్రతి ఏటా ప్రయాణీకుల ఛార్జీలు ఎక్కువగా పెంచకపోవడం లేదా తగ్గించడం ద్వారా రైల్వే శాఖ ప్రతి ఏటా రూ.26,000 నష్టపోతోంది.

రైల్వే శాఖ 67 శాతం సరుకు రవాణా ద్వారా ఆర్జిస్తోంది. ప్రతి రోజు రైల్వేలు 2.65 మిలియన్ల టన్నుల కార్గోను రవాణా చేస్తోంది. ఇండియన్ రైల్వేస్ యొక్క ఆపరేటింగ్ రేషియా 94 శాతంగా ఉంది. అంటే ప్రతి వంద పైసల్లో రైల్వే శాఖ 6 శాతం మాత్రమే ఆదా చేయగలుగుతోంది. స్వతంత్రం వచ్చాక రైల్వేలు ప్రతి ఏటా యావరేజ్‌గా 200 కిలోమీటర్లు పెరుగుతూ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆశలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రైల్వే బడ్జెట్ కేటాయింపుల పైన కోటి ఆశలతో ఉన్నాయి. ఆదాయంలో దక్షిణ మధ్య రైల్వే టాప్‌లో ఉన్నప్పటికీ కేటాయింపుల్లో మాత్రం దాదాపు చివరిస్థానంలో ఉంటోంది. దశాబ్దాలుగా ఎన్నో కదలని ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక ఏపీ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ఏపీలో ఓ జోన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.

సందర్భం అది కాదు,: మాడభూషి శ్రీధర్, ఆయన ఏమన్నారు?


న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పుస్తకాల పురుగు అంటూ తాను అన్నట్లు వచ్చిన వార్తాకథనంపై కేంద్ర సమాచార కమిషనర్ (సిఐసి) వివరణ ఇచ్చారు. కెసిఆర్ 70 వేల పుస్తకాలు చదివారంటూ తాను చెప్పిన సందర్భంగా ఆయన వివరించారు. దాని వెనుక సందర్భం తాను చెప్పిన ఇతర అంశాలు తెలిస్తే తానేమన్నానో అర్థం అవుతుందని ఆయన అన్నారు. సికెఎం కళాశాలలో ఆయన ప్రసంగం ఇలా సాగింది - "కలెక్టర్ కార్యాలయం కన్న ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాని కార్యాలయం కన్న ఒక కళాశాల గొప్పది. కలెక్టర్ ప్రధాని ముఖ్యమంత్రి కన్న ఒక ఉపాధ్యాయుడు గొప్పవాడు. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు విద్యాలయంలో అనేక మంది కలెక్టర్లను, ముఖ్యమంత్రుల్ని ప్రధాన మంత్రుల్ని తయారుచేస్తాడు. అరిస్టాటిల్ లేకుండా అలెగ్జాండర్ లేడు, చాణక్యుడు లేకపోతే చంద్రగుప్తుడు లేడు, రామేశ్వరం బడిలో టీచర్లు పాఠాలు చెప్పకపోతే అబ్దుల్ కలాం లేడు". "సి కె ఎం కళాశాల లేకపోతే నేను లేను. ఇక్కడ నేను వ్యాసాలు రాయడం నేర్చుకున్నాను. సికెఎం విద్యార్థుల రచనలతో కూడిన చైతన్య సంచిక ఎడిటర్ పదవికి వ్యాసరచన పోటీలో గెలిచి ఎడిటర్ అయ్యాను. ఎమర్జన్సీలో నా మాగజైన్ ను నిషేధించారు. విద్యార్థులకు పంచిపెట్టిన తరువాత పోలీసుల అధ్వర్యంలో తిరిగి విద్యార్థులనుంచి వసూలు చేసి ఆ సంచికలన్నీ తగల బెట్టాడు. కాని చైతన్యాన్ని తగల బెట్టలేకపోయారు. నా వ్యాసరచనా శక్తిని చంపలేకపోయారు. అక్కడ నేర్చుకున్న వ్యాసరచనల వల్లనే నేను పత్రికా రచయితనైనాను. లా ప్రొఫెసర్ గా అనేక వ్యాసాలు పుస్తకాలు రాసాను. ఆ వ్యాసాల వల్ల నేను కేంద్ర సమాచార కమిష్నర్ ను అయ్యాను. ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్ప కళాశాలా లేక రాజకార్యాలయాలా, ముఖ్యమంత్రులు ప్రదాన మంత్రులా లేక అధ్యాపకులా అని నేను అడిగితే కళాశాల ముఖ్యం అనీ టీచర్ ముఖ్యం అని విద్యార్థిలో్కం ముక్త కంఠంతో నినదించింది" శ్రీధర్ తన ప్రసంగంలో అన్నారు.
"ఆ నేపధ్యంలో ముఖ్యమంత్రి ఏ విధంగా చదువుకున్నాడో చెప్పాను. మాధ్యమిక తరగతులు చదవడానికి తన ఊళ్లో బడిలేకపోతే పక్కబడిలోకి కెసిఆర్ చిన్నప్పుడు వెళ్లాడు. అక్కడ ఒక టీచర్ ఆయనను తన ఇంట్లో పెట్టుకుని చదివించాడని ఓ దినపత్రిక ఆదివారం సంచికలో వివరంగా ఇచ్చారు. అక్కడ నేర్చుకున్న చదువు, ఆ టీచర్ నేర్పిన చదువు నాటిన విద్యాబీజాల వల్లనే ఆయన తెలంగాణా ఉద్యమాన్ని నడిపి తెలంగాణా రాష్ట్రం సాధించి, ముఖ్యమంత్రి కాగలిగారు. ఆ చదువు వల్లనే 70వేల పుస్తకాలు చదివగలిగారు. (ఇది కూడా ఓ పత్రిక ఆదివారం సంచికలో నేను చదివాను). ఆ పుస్తకాల లో ఉన్న విజ్ఙానం ఆ పంతులు చెప్పిన విజఙానం ఈ రోజు రాష్ట్రపాలనకు ఉపయోగపడుతుంది" అని అన్నట్లు ఆయన వివరించారు. పుస్తకాల పురుగు అని నేను అనలేదని శ్రీధర్ స్పష్టం చేశారు. చదువు, విద్యను కమ్యూనికేట్ చేసే గురువు లేకపోతే సమాజం ఉండదని తాను విద్యార్థులకు యువ విద్యార్థులకు చెప్పానని ఆయన అన్నారు.

మోడీ కేబినెట్ నుంచి టిడిపి తప్పుకోవాలి: జైరాం, ల్యాండ్ పూలింగ్‌పై ధర్మాన


న్యూఢిల్లీ/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై కాంగ్రెసు పార్టీ జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై, తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత జైరాం రమేష్ విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రంలోని ఎన్డియే ప్రభుత్వం అమలు చేయకపోతే ప్రధాని నరేంద్ర మోడీ మంత్రి వర్గం నుంచి టిడిపి బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి సాగదీత వైఖరి కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు. యుపిఎ ప్రభుత్వం ఆమోదించిన న్యూక్లియర్ బిల్లును అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వం ఎపికి ప్రత్యేక హోదా బిల్లును ఎందుకు అమలు చేయడం లేదని ఆయన అడిగారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానికి ల్యాండ్ పూలింగ్ చట్ట విరుద్ధమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బృందం అభిప్రాయపడింది. భూసేకరణను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేసింది. రాజధాని భూసేకరణ విషయంలో మొత్తం ఏడు అంశాలపై సిఆర్‌డిఎ కమిషనర్‌కు ధర్మాన ప్రసాద రావు నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బృందం ఓ వినతిపత్రం సమర్పించారు. అమాయకంగా ల్యాండ్ పూలింగ్‌కుక అంగీకరించిన రైతులందరికీ వారి పత్రాలను వెనక్కి ఇవ్వాలని నేతలు కోరారు. సిఆర్‌డిఎ పరిధి బయట టిడిపి నేతలు కొన్న వేలాది ఎకరాల భూములపై సిట్గింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు విభజన చట్టం ప్రకారం ప్రభుత్వ భూముల్లో రాజధాని కట్టుకునే అంశాన్ని పరిశీలించాలని వారు కోరారు. రైతులపై అధికారులు, మంత్రులు బెదిరింపులకు, ప్రలోభాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఈ విషయంపై కూడా న్యాయ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. పదో షెడ్యూల్‌లోని 94వ నిబంధన ప్రకారం ప్రభుత్వ భూముల్లోనే హైకోర్టు, సచివాలంయ, అసెంబ్లీ నిర్మాణాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. రైతులు, రైతు కూలీలు, భూమిలేని నిరుపేదలు, వృత్తిదారుల హక్కులను పరిరక్షించాలని వారు కోరారు.

తొక్కి పెట్టాలని చూస్తే జాగ్రత్త: బాబుకు కవిత హెచ్చరిక, దేవీప్రసాద్ రిజైన్



హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణలోని తెరాస జెండా తప్ప మరే జెండా కనిపించడం లేదన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమాజీగూడ మాజీ కార్పోరేటర్‌ మహేష్‌ యాదవ్‌ తెరాసలో చేరారు. కవిత, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డిల సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. ఆంధ్రా పాఠ్య పుస్తకాలలో తెలంగాణ చరిత్ర పెట్టనని చంద్రబాబు అంటున్నారన్నారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రను తొక్కిపెట్టాలని చూస్తే చంద్రబాబే చరిత్రలో లేకుండా పోతారని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. తెలంగాణ ప్రజల కోసమే ఉద్యమం చేశామన్నారు. పార్టీలో చేరుతున్న నాయకులకు సముచిత గౌరవం కల్పిస్తామని చెప్పారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణలోని తెరాస జెండా తప్ప మరే జెండా కనిపించడం లేదన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమాజీగూడ మాజీ కార్పోరేటర్‌ మహేష్‌ యాదవ్‌ తెరాసలో చేరారు. కవిత, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డిల సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. ఆంధ్రా పాఠ్య పుస్తకాలలో తెలంగాణ చరిత్ర పెట్టనని చంద్రబాబు అంటున్నారన్నారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రను తొక్కిపెట్టాలని చూస్తే చంద్రబాబే చరిత్రలో లేకుండా పోతారని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. తెలంగాణ ప్రజల కోసమే ఉద్యమం చేశామన్నారు. పార్టీలో చేరుతున్న నాయకులకు సముచిత గౌరవం కల్పిస్తామని చెప్పారు.
'మహా' రాజ్‌భవన్‌లో కేసీఆర్ హంగామా, తినిపించిన విద్యాసాగర్ (పిక్చర్స్)

ముంబై: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పుట్టిన రోజు వేడుకలను ముంబైలో జరుపుకున్నారు. మహారాష్ట్రలోని రాజ్ భవన్‌లో జరిగాయి. ఈ సందర్భంగా తెలుగువాడైన మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు పుష్పగుచ్ఛం ఇచ్చి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్ కేక్ కట్ చేశారు. కేసీఆర్‌కు గవర్నర్ విందు ఇచ్చారు. కేసీఆర్ వెంట తెరాస ఎంపీలు కే కేశవ రావు, జితేందర్ రెడ్డి, వినోద్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల స్వామి, జలరంగ నిపుణులు విద్యాసాగర రావు, మంత్రులు హరీష్ రావు, జోగు రామన్న, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు ఉన్నారు. అంతకుముందు కేసీఆర్ ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.సుబ్రతా రాయ్‌ బెయిల్ వ్యవహారం: పూర్తి నివేదిక, కొత్త ప్రణాళిక
న్యూఢిల్లీ: డిపాజిట్‌దార్లను మోసం చేసిన కేసులో జైల్లో ఉన్న సహారా చీఫ్ సుబ్రతా రాయ్‌‌కి బెయిల్ మంజూరు చేసేందుకు నిధుల కోసం అనుసరిస్తున్న కొత్త ప్రణాళికను తెలియజేయాల్సిందిగా సుప్రీం కోర్టు బుధవారం కోరింది. సుబ్రతా రాయ్‌ని బెయిల్‌పై బయటకు తెచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు సహారా అధికారులు. గత వారం అమెరికాకు చెందిన మిరాక్ క్యాపిటల్‌తో ఒప్పందం కుదిరిందని, 2 బిలియన్ డాలర్లను ఇచ్చేందుకు అంగీకారం తెలిపిందని కోర్టుకు తెలిపారు. కోర్టుకు డిపాజిట్ చేయాల్సిన డబ్బు కోసం న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్, లండన్‌లోని గ్రోస్వెనార్ హౌస్‌ లాంటి అతిధి గృహాలను సుబ్రతా రాయ్ అమ్మకానికి ఉంచారు. 


వీటిని కొనేందుకు పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నారని శారాన్ష్ శర్మ అనే పేరున్న మాజీ బ్రోకర్ సుబ్రతా రాయ్‌ని సంప్రదించాడు. ఆ తరువాత బ్యాంకు ఆఫ్ అమెరికాలోని ఖాతాలో ఆయన బిలియన్ డాలర్లకు పైగా నగదు జమ చేశాడని సహారా కార్పొరేట్ ఫైనాన్సు విభాగం హెడ్ సందీప్ వాద్వా తెలిపారు. అయితే, తమ బ్యాంక్‌లో అటువంటి ఖాతా ఏమీ లేదని బ్యాంకు అఫ్ అమెరికా అధికారులు స్పష్టం చేయడంతో, ఆయనకు బెయిలు తెప్పించేందుకుఫోర్జరీ పత్రాలను వాడినట్లు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆయన బెయిలు వ్యవహారంపై మొత్తం నివేదికను ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.



ఆప్ సునామీ: ప్రణబ్, మోడీ, రాజ్‌నాథ్ భేటీ కోరిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశవ్యాప్త ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో మేజిక్ ఫిగర్ 36. ఎగ్జిట్ ఫలితాలు అన్నీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఏఏపీ వైపే మొగ్గు చూపాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మించి ఏఏపీ గెలుచుకుంది. ఏఏపీ 67 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ 3 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో ఏఏపీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. బీజేపీ కార్యాలయం వద్ద సందడి కనిపించలేదు. 14 కేంద్రాల్లో కౌంటింగ్ జరిగింది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సునామీ సృష్టించారు. అన్ని పార్టీలనూ మట్టికరిపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అపాయింట్‌మెంట్ కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభా పక్ష నేతగా అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికయ్యారు. శాసనసభ్యులు మంగళవారం సాయంత్రం సమావేశమై తమ నేతగా ఆయనను ఎనుకున్నారు. కాగా, కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిశారు.

ప్రజల తీర్పు గౌరవిస్తామని, పార్టీ పనితీరును సమీక్షించి, ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని కాంగ్రెస్ నేత పీసీ చాకో అన్నారు. కాంగ్రెస్ అంతర్థానమైందని, కాంగ్రెస్ ఓట్లన్నీ బీజేపీకే పడ్డాయని, దేశ ప్రజల ఆశలకు అనుగుణంగా బీజేపీ నడుచుకోవడం లేదని లోక్‌సత్తా జేపీ అన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ, ఏఏపీల మధ్య సామాజిక అనుసంధాన వెబ్ సైట్లలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ ఏఏపీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. విజయగర్వం వద్దని అరవింద్ కేజ్రీవాల్ పార్టీ వారికి సూచించారు. కేంద్రం నుండి ఢిల్లీ అభివృద్ధికి సహకారం ఉంటుందని వెంకయ్యనాయుడు చెప్పారు. కిరణ్ బేడీ 2,277 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

No comments:

Post a Comment

Recent Post